Coronavirus: ఈ మూడు దేశాల్లో నిలకడగా కరోనా కేసులు

కెనడా, ఉక్రెయిన్, ఇటలీ దేశాలలో కరోనా కేసుల సంఖ్య నిలకడగా ఉంది.

Update: 2020-04-23 09:58 GMT

కెనడా, ఉక్రెయిన్, ఇటలీ దేశాలలో కరోనా కేసుల సంఖ్య నిలకడగా ఉంది. కెనడాలో అయితే సోకిన వారి సంఖ్య 40 వేలు దాటింది ,ఇక్కడ మొత్తం 1974 మంది మరణించారు. రెండు కెనడియన్ ప్రావిన్సులు, క్యూబెక్ లో (20,965) మంది , అంటారియో (12,245) లో మందికి వైరస్ సోకింది. ఇక ఉక్రెయిన్‌లో 467 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తంగా వైరస్ భారిన పడిన వారి సంఖ్య 6,592 కు పెరిగింది. అదే సమయంలో మృతుల సంఖ్య 174 కి చేరుకుంది. గత 24 గంటల్లో దేశంలో 467 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.

ఇక ఉక్రెయిన్ లో ఇప్పటివరకు 424 మంది సోకిన రోగులకు నయమైంది, దాంతో వీరు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కొత్త కేసుల వేగం తగ్గకపోవడంతో మే 12 నాటికి దేశవ్యాప్తంగా నిర్బంధం విషయంలో సడలింపు ఇవ్వాలని ఆరోగ్య మంత్రి మాగ్జిమ్ స్టెపనోవ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. మరోవైపు ఇటలీలో కూడా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. 24 గంటల్లో 437మంది మరణించారు , దీంతో దేశంలో మరణించిన వారి సంఖ్య 25 వేలు దాటింది. ఇటలీలో మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఒక రోజు క్రితం 534 మంది ఇక్కడ మరణించారు.


Tags:    

Similar News