Coronavirus: గాలిలో 6 అడుగుల దూరం వరకు వైరస్‌ వ్యాప్తి

Coronavirus: కరోనా వైరస్‌ మహమ్మారి గాలి ద్వారాను వ్యాప్తి చెందుతుందని జాతీయ, అంతర్జాతీయ నివేదికలు ఇదివరకే వెల్లడించాయి.

Update: 2021-05-10 04:42 GMT

Coronavirus: గాలిలో 6 అడుగుల దూరం వరకు వైరస్‌ వ్యాప్తి

Coronavirus: కరోనా వైరస్‌ మహమ్మారి గాలి ద్వారాను వ్యాప్తి చెందుతుందని జాతీయ, అంతర్జాతీయ నివేదికలు ఇదివరకే వెల్లడించాయి. అయితే, గాలిలో వైరస్‌ కణాలు ఎంత దూరం వ్యాప్తి చెందుతాయనే విషయంపై అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది.

వైరస్‌ సోకిన వ్యక్తినుంచి 3 నుంచి 6 అడుగులలోపు వ్యాప్తి అధికంగా ఉంటుందని.. వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో ఆరు అడుగుల కంటే కాస్త ఎక్కువ దూరం వ్యాప్తికి అవకాశం ఉంటుందని అమెరికా సీడీసీ తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. వైరస్‌ సోకిన వ్యక్తుల నుంచి శ్వాసించినప్పుడు వెలువడే స్వల్ప శ్వాసబిందువుల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని ఇప్పటికే వెల్లడైంది. ఇది 3 నుంచి ఆరు అడుగుల లోపల ఈ సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సీడీసీ స్పష్టంచేసింది.

Tags:    

Similar News