మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్

Corona Cases: అమెరికా, చైనాల, యూరప్ దేశాల్లోనూ వేల కేసులు

Update: 2022-03-16 02:00 GMT

మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్

Corona Cases: అటు అమెరికాలో, ఇటు చైనాలో, ఇంకోపక్క యూరప్ దేశాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అవును.. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల్లో పెరుగుదల స్పష్టంగా కన్పిస్తోంది. ముఖ్యంగా స్కూల్స్ రీ ఓపెనింగ్, ఆఫీసులకు తిరిగి వెళ్తుండడం, మాస్క్ నిబంధనల సడలింపు కారణాలు అయి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ముఖ్యంగా జనాలు బయటే ఎక్కువగా తిరుగుతుండటంతో వైరస్ విజృంభిస్తోందని అంచనా వేస్తున్నారు.

జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా ఇతర ఐరోపా దేశాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. రెండు వారాలుగా కేసులు పెరిగిపోతున్నట్లు ఆయా దేశాలు కరోనా లెక్కులు చెబుతున్నాయి. ముఖ్యంగా యూఎస్ తరహా వాతావరణం, ఉక్రెయిన్ యుద్ధ హడావుడి నేపథ్యంలో వలసల కారణాలతో కేసులు పెరిగిపోతుండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచం మళ్లీ ఉలిక్కి పడింది.

చైనాలో ప్రతీరోజు 5వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెస్టులు పెంచిన డ్రాగన్ సర్కార్ కఠిన లాక్ డౌన్ తో కట్టడికి యత్నిస్తోంది. అయితే హాంకాంగ్ లోనూ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. అయితే భారత్ లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు కన్పిస్తున్నాయి. వరుసగా రెండోరోజు 3వేల దిగువకు కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ మరణాల సంఖ్య మాత్రం రోజుకు వందకు చేరుకుంది.

Tags:    

Similar News