China: డ్రాగన్‌ గుండెల్లో పేలిన బాంబు.. మళ్లీ మొదలైన కరోనా మరణాలు

China: 6 నెలల తరువాత కరోనాతో ఓ వృద్దుడు మృతి.. సీరియస్‌గా తీసుకున్న చైనా ప్రభుత్వం

Update: 2022-11-20 12:03 GMT

China: డ్రాగన్‌ గుండెల్లో పేలిన బాంబు.. మళ్లీ మొదలైన కరోనా మరణాలు

China: డ్రాగన్‌ కంట్రీని కరోనా వణికిస్తోంది. నిత్యం భారీగా కేసులు నమోవుతున్న చైనాలో... తాజాగా ఆరు నెలల తరువాత తొలి మరణం నమోదయ్యింది. రాజధాని బీజింగ్‌కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు చనిపోయినట్టు నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది. దీంతో బీజింగ్‌లో సెమీ లాక్‌డౌన్‌ను అధికారులు విధించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మళ్లీ మూతపడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే కార్యకలాపాలను అన్నింటిని బీజింగ్‌ రద్దు చేసింది. మే 26న షాంఘైకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. తాజా మరణంతో చైనా వ్యాప్తంగా ఇప్పటివరకు 5వేల 227 మంది మాత్రమే మృతి చెందినట్టు హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. జీరో కోవిడ్‌ పాలసీ పేరుతో చైనా కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నా.. కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 24వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆరు నెలల తరువాత.. ఇంత భారీ స్థాయిలో కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో ఇప్పటివరకు 2లక్షల 86వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. అయితే అమెరికా, భారత్‌ వంటి దేశాలతో పోలిస్తే.. కేసుల సంఖ్య చాలా స్వల్పం. ఈ లెక్కన చైనా ఆంక్షలను సడలించాల్సింది. కానీ.. ఆ రకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చైనాలో వైరస్‌ కంటే.. ఎక్కువ ఆంక్షలకే ప్రజలు భయపడుతున్నారు.

Full View
Tags:    

Similar News