Nikki Haley Comment on Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆటలు ఎక్కువ కాలం సాగవు..

Update: 2020-07-29 07:26 GMT

Nikki Haley Comment on Xi Jinping: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ పై.. ఐక్యరాజ్యసమితి (యుఎన్) మాజీ అమెరికా రాయబారి నిక్కి హేలీ విమర్శలు గుప్పించారు, అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆధ్వర్యంలో.. ఐరాసలో స్థాయికి మించి చైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించడం తోపాటు, బెదిరింపులకు దిగుతోందని అన్నారు. అంతేకాదు జిన్‌పింగ్ ఇతర దేశాల వైపు వేళ్లు ఎత్తి చూపడం ప్రారంభించాడని అన్నారు. జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన తరువాత, ఐరాసలో చైనా వైఖరి దూకుడుగా మారిందని.. నాయకత్వ పాత్రను పొందడానికి ప్రయత్నాలు ప్రారంభించిందని అన్నారు. దీని కోసం అందరితో మాట్లాడటం కూడా చైనా ప్రారంభించిందని.. అయినప్పటికీ, జిన్‌పింగ్ ఆటలు ఎక్కువ కాలం సాగవని ఆమె అన్నారు.

మంగళవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేలీ ఈ విషయం చెప్పారు. తాను ఐరాసలో పనిచేస్తున్న సమయంలో చైనా చాలా నిశ్శబ్దంగా ఉందని.. అప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించిందని.. కానీ ఆ తరువాత బ్యాక్ డోర్ ద్వారా ముఖ్యమైన స్థానాలలోకి వెళ్లిందని అన్నారు.

ప్రజలను స్వేచ్ఛగా జీవించడానికి అనుమతించని ఏ దేశమూ ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని ఆమె అన్నారు. ప్రస్తుతం హాంకాంగ్‌లో ప్రజలు తిరుగుబాటు ప్రారంభించే సమయం వచ్చిందని చెప్పారు. అయితే చైనా మాత్రం ఈ తిరుగుబాటును అణచివేయడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. చైనా.. తైవాన్, దక్షిణ చైనా సముద్ర దేశాలు , అలాగే భారతదేశంపై కూడా దాడులకు దిగుతోందని.. ఇదంతా ప్రపంచం ముందు తనను తాను బలంగా చూపించుకోవడానికే చైనా ఇలా చేస్తుందని అన్నారు. 

Tags:    

Similar News