America - China: కరోనా మూలాలపై అగ్రరాజ్యం నివేదిక

*నివేదికపై మండిపడ్డ డ్రాగన్ కంట్రీ *మరోసారి దర్యాప్తునకు ససేమిరా అంటున్న చైనా

Update: 2021-11-01 04:43 GMT

అగ్రరాజ్యం నివేదికపై మండిపడ్డ డ్రాగన్ కంట్రీ(ఫైల్ ఫోటో)

America - China: కొవిడ్ మూలాలపై అగ్రరాజ్యం అమెరికా నిఘా విభాగం రూపొందించిన నివేదికపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ నివేదికను తప్పుడు నివేదికగా పేర్కొంది చైనా. తమపై దాడులు చేయడాన్ని మానుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. WHO ఆధ్వర్యంలో మరోసారి దర్యాప్తునకు అంతర్జాతీయ నిపుణుల బృందం సిద్ధమవుతోంది. దీంతో చైనా ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

కరోనా మూలాలపై ఆగస్టులో విడుదలైన నివేదికను వ్యతిరేకించామని చైనా పేర్కొంది. అయితే ఆ నివేదిక ఎన్నిసార్లు ప్రచురితమైనా, వాటిని మార్పులు చేసి ఎన్ని రకాల కట్టుకథలు అల్లినా వారి రాజకీయ, తప్పుడు స్వభావం అర్థమవుతూనే ఉంటుందని విమర్శించారు.

కోవిడ్ మూలాలను గుర్తించే పేరుతో అమెరికా నిఘా విభాగం చేసిన ప్రయత్నాలు రాజకీయం చేస్తుందనడానికి నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో చైనాపై దాడులు చేయడం, దుమ్మెత్తిపోసే చర్యలను ఆపివేయాలంటోంది చైనా.

కొవిడ్‌ మూలాలపై 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అక్కడి నిఘా విభాగాన్ని ఆదేశించింది. ఆయన ఆదేశాల మేరకు కొవిడ్‌ మూలాలపై అమెరికా నిఘా విభాగం రెండు నెలల కిందటే ఓ నివేదికను రూపొందించింది. కొవిడ్‌ మూలాలపై కొత్తగా ఎటువంటి సమాచారం లేనందున కచ్చితంగా ఓ తుది నిర్ణయానికి రాలేకపోతున్నట్లు అందులో పేర్కొంది.

ముఖ్యంగా జంతువుల నుంచి మానవులకు సోకిందా లేక ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యిందా అనే విషయంపై క్లారిటీ రాలేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ దర్యాప్తునకు చైనా అడ్డుతగులుతుందన్న అమెరికా వాటిపై తుది నిర్ణయానికి రావాలంటే చైనా మరింత సహకారం అందించాలని స్పష్టం చేసింది. 

Tags:    

Similar News