అమెరికాపై చైనా ప్రతివిమర్శలు.. ఆ బకాయిలు చెల్లించాలని డిమాండ్

కరోనా వైరస్ వ్యాప్తికి కారణం చైనానే అంటూ అమెరికాతో సహా చాలా దేశాలు వేలెత్తి చూపుతున్న తరుణంలో డ్రాగన్‌ కంట్రీ ఆసక్తికర ప్రకటన చేసింది.

Update: 2020-05-16 05:38 GMT
Donald Trump (File Photo)

కరోనా వైరస్ వ్యాప్తికి కారణం చైనానే అంటూ అమెరికాతో సహా చాలా దేశాలు వేలెత్తి చూపుతున్న తరుణంలో డ్రాగన్‌ కంట్రీ ఆసక్తికర ప్రకటన చేసింది. అమెరికాపై చైనా ప్రతివిమర్శలు చేసే ప్రయత్నం చేసింది. ఐక్యరాజ్య సమితికి అమెరికా భారీ మొత్తంలో బకాయిలు చెల్లించాలని ప్రకటనలో పేర్కొంది. వివిధ దేశాలు చెల్లించాల్సిన మొత్తాన్ని గుర్తుచేసింది. వీలైనంత త్వరగా సభ్యదేశాలు కూడా బకాయిలను చెల్లించాలని కోరింది.

ఐక్యరాజ్య సమితి బడ్జెట్‌కు అత్యధికంగా 22 శాతం నిధుల్ని అమెరికా సమకూరుస్తోంది. ప్రతి ఏడాది దాదాపు మూడుపదుల బిలియన్‌ డాలర్లు అందిస్తోంది. అలాగే శాంతిస్థాపన కార్యక్రమాలకు కావాల్సిన నిధుల్లోనూ 25 శాతం భరిస్తోంది. అమెరికా 27.89 శాతం నిధుల్ని సమకూర్చాల్సి ఉంటుంది. కానీ, ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 25 శాతానికి కుదిస్తూ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

అమెరికా గత కొన్ని ఏళ్లుగా అత్యధిక బకాయి పడ్డ దేశంగా ఉంది.. సాధారణ బడ్జెట్‌కు 1.165 బిలియన్‌ డాలర్లు, శాంతిస్థాపన బడ్జెట్‌కు 1.332 బిలియన్‌ డాలర్లు యూఎస్‌ అందించాల్సి ఉందని చైనా పేర్కొంది. అమెరికా తీవ్రంగా ఖండించింది. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో దోషిగా ఉన్న చైనా అబద్ధాలతో ప్రపంచ దేశాల దృష్టిని మరల్చే ప్రయత్నాల్లో ఇదొకటని ఆరోపించింది. అమెరికా 726 మిలియన్ డాలర్లు చెల్లించిందని ఐక్యరాజ్యసమితి యూఎస్‌ శాశ్వత కమిషన్‌ వెల్లడించింది. 888 మిలియన్‌ డాలర్లు మాత్రమే బకాయిపడ్డామని తెలిపింది.


Tags:    

Similar News