Coronavirus: హెల్త్ మినిస్టర్ రాజీనామా

ప్రపంచంలో కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు 4 లక్షల 29 వేల 965 మంది మరణించారు. అదే సమయంలో, కరోనా సోకిన వారి సంఖ్య 78 లక్షల 1 వేల 786 కు చేరుకుంది.

Update: 2020-06-14 09:54 GMT

ప్రపంచంలో కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు 4 లక్షల 29 వేల 965 మంది మరణించారు. అదే సమయంలో, కరోనా సోకిన వారి సంఖ్య 78 లక్షల 1 వేల 786 కు చేరుకుంది. ఇప్పటివరకు 40 లక్షల 2 వేల 947 మంది కోలుకున్నారు. పాకిస్తాన్‌లో షాహిద్ ఖాకాన్ అబ్బాసి తర్వాత మరో మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ వ్యాధి బారిన పడ్డారు. ఇక మరణాలలో తేడాలు ఉండటంతో చిలీ ఆరోగ్య మంత్రి శనివారం రాజీనామా చేశారు. ఆరోగ్య శాఖా మంత్రిగా ఉన్న జెమ్ మానెలిచ్ రాజీనామా చేశారని చీలి అధ్యక్షుడు సెబాస్టియన్ ప్రకటన చేశారు. మార్చి 3 న చిలీలో మొదటి కేసు వెలువడినప్పటి ఇప్పటివరకూ 3 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం బహిరంగంగా తెలిపింది.

అయితే శనివారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కు నివేదికలో మాత్రం మరణించిన వారి సంఖ్య 5,000 కంటే ఎక్కువ అని చిలీ తెలియజేసినట్లు ఒక నివేదిక వెల్లడైంది . దీంతో మరణాల నివేదికలో ప్రభుత్వం who కి పంపిన సంఖ్య, బహిరంగంగా ప్రకటించిన లెక్కలో తేడాలు ఉన్నట్టు బయటపడింది. దీనిపై చీలి ఆరోగ్య శాఖను సంప్రదించగా.. డిప్యూటీ ఆరోగ్య శాఖా మంత్రి వివరణ ఇచ్చారు. అయితే ఈ తేడాకు నైతిక బాధ్యత వహిస్తూ ఆరోగ్య మంత్రి జెమ్ మానెలిచ్ తన పదవికి రాజీనామా చేశారు. కాగా చిలీలో ఇప్పటివరకు లక్ష 67 వేల 355 సంక్రమణ కేసులు నమోదయ్యాయి.. ఇప్పటివరకూ 3101 మంది మరణించారని ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News