లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు షాక్.. ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా
Lawrence Bishnoi gang: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేరుస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది.
Lawrence Bishnoi gang: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేరుస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. బిష్ణోయి ముఠాను కెనడా దేశ క్రిమినల్ కోడ్ ప్రకారం.. ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లు కెనడా ప్రజా భద్రతల శాఖ మంత్రి గ్యారీ ఆనంద సంగరీ వెల్లడించారు. దీంతో దేశంలోని బిష్ణోయ్ ముఠాకు సంబంధించిన ఆస్తులు, నగదు, వాహనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు.
ఆ ముఠా సభ్యుల నేరాలపై విచారణ జరపడానికి కెనడియన్ చట్ట సంస్థలకు మరిన్ని అధికారాలు కూడా లభిస్తాయని తెలిపారు. ఈ చర్యతో అనుమానిత ముఠా సభ్యులను దేశంలోకి ప్రవేశించకుండా ఇమిగ్రేషన్ అధికారులు నిరోధించవచ్చని కెనడా ప్రజా భద్రతల శాఖ మంత్రి గ్యారీ ఆనంద సంగరీ వెల్లడించారు.