కెనడాలో హోరెత్తుతున్న నిరసనలు.. బ్రిటిష్ రాణుల విగ్రహాలను కూల్చివేసిన..

Canada: కెనడాలో ఆందోళనలు మిన్నంటాయి.

Update: 2021-07-03 13:05 GMT

కెనడాలో హోరెత్తుతున్న నిరసనలు.. బ్రిటిష్ రాణుల విగ్రహాలను కూల్చివేసిన..

Canada: కెనడాలో ఆందోళనలు మిన్నంటాయి. బ్రిటీష్ రాచరికపు గుర్తులు కెనడాపై తొలగిపోవాలంటూ అక్కడ నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో స్కూళ్ల ఆవరణల్లో వందల సంఖ్యలో పిల్లల అస్థిపంజరాలు బయటపడటం కెనడా వాసుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది. అందుకే కెనడా డే రోజున స్థానిక ప్రజలు నిరసన దినాన్ని పాటించారు. బ్రిటీష్ పాలన నాటి మారణహోమాలను గుర్తు చేసుకుంటూ బ్రిటీష్ రాణుల విగ్రహాలను కూల్చి వేశారు.

మరోవైపు పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన స్థానికులు విన్నిపెగ్‌లో ఉన్న క్వీన్ విక్టోరియా విగ్రహాన్ని కూల్చేశారు. ఎలిజబెత్ రాణి కాదు రాక్షసి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అయితే, ఈ ఘటనలను బ్రిటిష్ ప్రభుత్వం ఖండించింది. కెనడాలో జరుగుతున్న ఘటనలకు తాము బాధపడుతున్నామని, విగ్రహాలను కూల్చివేయడం సరికాదని వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News