పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్‌ ప్రధానికి కాబోయే భార్య

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌(55) మరోసారి తండ్రయ్యారు. ఆయనకు కాబోయే భార్య క్యారీ సైమండ్స్‌(32) బుధవారం లండన్‌ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

Update: 2020-04-30 03:17 GMT
Carrie Symonds, Boris Johnson

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌(55) మరోసారి తండ్రయ్యారు. ఆయనకు కాబోయే భార్య క్యారీ సైమండ్స్‌(32) బుధవారం లండన్‌ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బోరిస్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని.. ఈ విషయంలో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చాలా ఆనందంగా ఉన్నారని.. జాతీయ ఆరోగ్య సేవల మెటర్నరీ విభాగానికి ధన్యవాదాలు చెప్పినట్టు ప్రతినిధి తెలిపారు. బోరిస్‌ జాన్సన్ జంటకు వివిధ దేశాల నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే తమ అభినందనలు తెలిపారు. ఆ తరువాత చాలా మంది మంత్రులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా బోరిస్‌ జాన్సన్‌కు తన మాజీ భార్య మెరీనా వీలర్‌తో ఇదివరకే నలుగురు సంతానం ఉన్నారు. కొంతకాలంగా క్యారీ సైమండ్స్ తో ఆయన సహజీవం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వారి నిశ్చితార్ధం కూడా జరిగింది. ఇదిలావుంటే బోరిస్‌ జాన్సన్ కోవిడ్ భారిన పడి ఇటీవలే కోలుకున్నారు. దాంతో సోమావరమే తిరిగి డ్యూటీ లో చేరారు.


Tags:    

Similar News