Delta Variant: డెల్టా వేరియంట్‌పై బ్రిటన్​ఆరోగ్య అధికారుల హెచ్చరిక

Delta Variant: డెల్టా రకంతో పెరుగుతోన్న రీఇన్​ఫెక్షన్​ ముప్పు! * వైరస్‌ నుంచి కోలుకున్నా రెండోసారి వైరస్ సోకే ప్రమాదం

Update: 2021-07-24 05:07 GMT
Representational Image

Delta Variant: డెల్టా వేరియంట్ కారణంగా కొవిడ్​-19 బారినపడి కోలుకున్న వారిలోనూ రెండోసారి వైరస్​ సోకే ప్రమాదం అధికంగా ఉందని బ్రిటన్​ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డెల్టా ముప్పుపై పరిశోధన కొనసాగుతోందని తెలిపారు. దేశంలో అన్ని వేరియంట్లపై వారం రోజులకోసారి పరిశీలన చేస్తోంది ఇంగ్లాండ్​కు చెందిన ప్రజారోగ్య శాఖ. గత వారంలో 33,716 డెల్టా కేసులు పెరిగాయని, దాంతో దేశంలో మొత్తం డెల్టా కేసుల సంఖ్య 2,86,765 చేరినట్లు తెలిపింది. అలాగే.. ఏప్రిల్​-జూన్​ మధ్యలో నమోదైన 68,688 డెల్టా కేసుల్లో 897 మందికి రెండోసారి వైరస్​ సోకినట్లు వివరించింది.

ఇటీవల ఆసుపత్రుల్లో చేరిన వారి సమాచారం ప్రకారం 3వేల 692 మంది డెల్టా బారినపడ్డారు. అందులో 58.3 శాతం వ్యాక్సిన్ తీసుకోనివారేనని తెలిపారు. ఒక్క డోసు కన్నా రెండు డోసులు తీసుకుంటే మరింత సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించారు. వీలైనంత త్వరగా రెండో డోసు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Tags:    

Similar News