నాకు కత్తి ఇవ్వండి గుండెల్లో పొడుచుకుంటా.. కన్నతల్లి ముందే కన్నీరుమున్నీరు
ఓ తొమ్మిదేళ్ల పిల్లాడు చనిపోవాలని ఉందని కన్న తల్లి ముందు కన్నీరు పెట్టుకున్నాడు.
ఓ తొమ్మిదేళ్ల పిల్లాడు చనిపోవాలని ఉందని కన్న తల్లి ముందు కన్నీరు పెట్టుకున్నాడు. తనకు తాడు ఇవ్వండి..ఉరి వేసుకుంటా.. అంటూ హృదయవిదారకంగా ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. బ్రిస్బేన్‌కు చెందిన క్వాడెన్ మరుగుజ్జుతనం కారణంగా బాధపడుతున్నాడు. తన స్కూల్లో తోటి విద్యార్థులు కూడా అతన్ని అవమానించేవారు. ఈ అవమానాలు తట్టుకోలేనని ఆ చిన్నారి ఎవరైనా తనని చంపేయాలని, తాడు ఇస్తే ఉరి వేసుకొని చనిపోతా అంటూ కన్నీరుమున్నీరు అవుతున్నాడు.
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొమ్మిదేళ్ల క్వాడెన్ కుర్రాడు అచాన్రోప్లాసియా అనే మరుగుజ్జుతనంతో బాధపడుతున్నాడు. దీంతో స్కూల్లో విద్యార్ధులు బాగా అవమానించేవారు అయినా క్వాడెన్ వారి మాటలను పట్టించుకునే వాడు కాదు. కానీ, వారి అవమానాలు, వేధింపులు రోజురోజుకు పెరగసాగాయి.
క్వాడెన్ గత బుధవారం రోజు కూడా విద్యార్ధులు అవమానించారు. దీంతో క్వాడెన్ మనస్తాపానికి గురయ్యాడు. స్కూల్ ముగిసిన తర్వాత సాయంత్రం తల్లి యర్రాక బైల్స్ క్వాడెన్ కోసం వచ్చింది. మౌనంగా కారులో కూర్చున్న అతడు ఏడవటం ప్రారంభించాడు.
కొడుకు ఏడుపు గమనించిన తల్లి యర్రాక బైల్స్ ఏమైందని విచారించింది. క్వాడెన్ జరిగిన అవమానాన్ని తల్లితో చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు. అంతే కాకుండా 'నేను చనిపోవాలి.. నాకు తాడు ఇస్తే.. నేను ఉరివేసుకుంటా. కత్తి ఇస్తే గుండెల్లో కత్తితో పొడుకుని చనిపోతా... ఎవరైనా నన్ను చంపేయండి' అంటూ తల్లిముందు కన్నీరుపెట్టుకున్నాడు. కొడుకు మాటలు విని తల్లి హృదయం తల్లడిల్లి పోయింది. కొడుకు ఏడుస్తున్న దృశ్యాలను వీడియో తీసిన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేసింది. దీంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యర్రాక బైల్స్ స్పందిస్తూ.. '' మా అబ్బాయి అవమానాలు భరించడం కొత్తేమీ కాదు. ఒక సారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నేను ఇలాంటి విషయాలను ప్రిన్సిపల్‌కు చెప్పె దాన్ని. కానీ, ఓ పిల్లాడి బాధపడుతున్న విషయాన్ని అందరికి తెలియాలని వీడియో చిత్రీకరించా అని యర్రాక బైల్స్ తెలిపింది.