కరోనా 'డేటా' విషయంలో బ్రెజిల్ సంచలన నిర్ణయం

బ్రెజిల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి కరోనా కేసులు, మరణాల జాబితాను అధికారికంగా వెల్లడించకూడదని నిర్ణయించుకుంది.

Update: 2020-06-07 06:06 GMT

బ్రెజిల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి కరోనా కేసులు, మరణాల జాబితాను అధికారికంగా వెల్లడించకూడదని నిర్ణయించుకుంది.అందులో భాగంగా శనివారం కరోనాకు సంబంధించిన డేటాను ఓ వెబ్‌సైట్ నుండి తొలగించింది. ఈ వెబ్‌సైట్‌లో, దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య, మరణాలు మరియు దాని నుండి కోలుకుంటున్న వారి సంఖ్య నివేదించబడుతున్నాయి,

అంతేకాదు దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా మొత్తం సోకిన వారి సంఖ్యను విడుదల చేయడాన్ని ఆపివేసింది. ఈ నిర్ణయం తీసుకుందో మాత్రం బ్రెజిల్ వెల్లడించలేదు. మరోవైపు బ్రెజిల్ లో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది.. ఇప్పటివరకు 6 లక్షలకు పైగా 72 వేల కేసులు నమోదయ్యాయి. గత వారం మాత్రమే, ఇక్కడ మరణాల సంఖ్య 36 వేలు దాటింది, ఇది యుఎస్ కంటే ఎక్కువ.

Tags:    

Similar News