Elon Musk: అమెరికన్లను బైడెన్‌ 'ఫూల్స్‌'గా చూస్తున్నారు..!

Elon Musk: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.

Update: 2022-01-28 12:20 GMT

Elon Musk: అమెరికన్లను బైడెన్‌ ‘ఫూల్స్‌’గా చూస్తున్నారు..!

Elon Musk: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరిన్‌ ప్రజలను బైడెన్‌ ఫూల్స్‌ మాదిరిగా చూస్తున్నారంటూ మండిపడ్డారు. మానవ రూపంలో ఉన్న తోలు బొమ్మ అంటూ ట్విట్టర్‌ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలనే ల‌క్ష్యంతో ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌ ఇటీవల ప్రముఖ సంస్థల సీఈవోలతో భేటీ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జనరల్‌ మోటార్స్‌, ఫోర్డ్‌ సంసథలు స్థానికంగా భారీ స్థాయిలో ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తున్నాయంటూ ట్విట్టర్‌ వేదికగా కితాబిచ్చాడు. అయితే ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో పేరుగాంచిన టెస్లా పేరును మాత్రం బైడెన్‌ ప్రస్తావించలేదు. ఎలాన్‌ మస్క్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. 


Tags:    

Similar News