Bangladesh: బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం 23 మంది మృతి
Bangladesh: ప్రమాద సమయంలో పడవలో 70 మంది ప్రయాణం
Bangladesh: బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం 23 మంది మృతి
Bangladesh: బంగ్లాదేశ్‌లో జరిగిన పడవ ప్రమాదంలో 23 మంది మృత్యువాతపడ్డారు. 70 మందికి పైగా ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. దీంతో పడవలో ప్రయాణిస్తున్న వారు నీట మునిగారు. ఊపిరాడకుండా ప్రాథమికంగా 23 మంది మృత్యువాత పడ్డారు. బంగ్లాదేశ్ లో తరచూ పడవ ప్రమాదాలతో జనం నీటమునగడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. పద్మానదిలో మేనెలలో జరిగిన పడవ ప్రమాదంలో 26 మంది మృత్యువాతపడ్డారు.