పాక్‌పై విరుచుకుపడుతోన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ

Pakistan: ఓ వైపు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. పాక్‌ను వేర్పాటువాద కుంపటి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Update: 2025-05-10 10:33 GMT

పాక్‌పై విరుచుకుపడుతోన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ

Pakistan: ఓ వైపు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. పాక్‌ను వేర్పాటువాద కుంపటి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌పై దాడులు చేస్తుండగా..బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోవైపు విరుచుకుపడుతోంది. పాకిస్థాన్ ఎయిర్‌ బేస్‌లు, గ్యాస్‌ పైప్‌లైన్లపై దాడి చేసినట్టు బీఎల్‌ఏ ప్రకటించింది. 39 ప్రాంతాల్లో దాడులకు పాల్పడిన బీఎల్‌ఏ.. దాడులకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది.

తమ దాడుల్లో పోలీస్ స్టేషన్లు, హైవేలను నిర్బంధించినట్టు వెల్లడించింది. పాక్ ఆర్మీ ఇన్‌ఫార్మర్లను కూడా అరెస్ట్ చేశామంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోన్న పాక్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని హెచ్చరించింది. 

Tags:    

Similar News