భారత్, చైనాల్లో కరోనా టెస్టులపై ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2020-06-07 02:34 GMT
Donald Trump (File Photo)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాల్లో కరోనా టెస్టులు సరిగ్గా చేయడం లేదన్నారు. రెండు దేశాల్లో టెస్టులు ఎక్కువగా చేస్తే, అమెరికా కంటే కరోనావైరస్ పాజిటివ్ కేసులు అధికంగా ఉంటాయని ఆయన అన్నారు. అమెరికాలో 2 కోట్ల మందికి కోవిడ్19 టెస్టులు చేసినట్లు ట్రంప్ ఒక కార్యక్రమంలో వెల్లడించారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ టెస్టులను 40 లక్షల మందికి నిర్వహించింది. అమెరికాలో కోవిడ్ -19 టెస్టులపై వ్యాఖ్యానించిన ట్రంప్ మాట్లాడుతూ...ఎన్ని ఎక్కువ టెస్టులు జరిపితే అన్ని ఎక్కువ కేసులు వస్తాయని పేర్కొన్నారు. చైనా, భారత్ లో ఈ తరహాలో టెస్టులు చేస్తే అక్కడ ఎక్కువ కేసులు ఉంటాయని ట్రంప్ అన్నారు.

నవంబర్ 3 న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగా, ట్రంప్ రెండవసారి పదవిని పొందటానికి ప్రయత్నిస్తున్నారు. కరోనా వైరస్ శత్రువుని ఓడించడానికి, ప్రభుత్వం పరిశ్రమకు బలాన్ని ఇచ్చిందని ట్రంప్ చెప్పారు. 


Tags:    

Similar News