ట్రంప్ సంచలన నిర్ణయం.. గ్రీన్ కార్డుల జారీ నిలిపివేత

ఇప్పటికే వలసలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించిన అమెరికా. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2020-04-22 17:21 GMT
Donald Trump (File Photo)

ఇప్పటికే వలసలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించిన అమెరికా. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రీన్ కార్డుల జారీని కూడా నిలిపివేస్తున్నట్టు అగ్రరాజ్యం ప్రకటించింది. అమెరికన్ల ఉద్యోగ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ప్రకటించింది. గ్రీన్ కార్డులు జారీ రెండు నెలలపాటు నిలిపివేస్తునట్లు తెలిపింది. గ్రీన్ కార్డులను పొందిన వారు అమెరికాలో శాశ్వత నివాసులుగా గుర్తిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ర వీసా సేవలు యూఎస్ లో నిలిచిపోగా, దీని ప్రభావం అమెరికా నిరుద్యోగులకు ఎలా సహాయపడుతుందన్న విషయంలో స్పష్టత లేదు.

కాగా, అగ్రరాజ్యం అమెరికా కరోనా ధాటికి విలవిలాడుతోంది. కరోనా సోకి 45 వేల మంది వరకూ మరణిం చారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని ట్రంప్ సర్కార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రజల దృష్టిని మళ్లించడానికే ట్రంప్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ట్రంప్ ప్రకటన ఎన్నికలకు బలమైన ప్రచార సాధనమే అయినప్పటికీ, కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాల వల్ల అది పనికి రాకుండా పోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News