Coronavirus: అమెరికాలో మరణాల సంఖ్య 50వేలు దాటేసింది..

Update: 2020-04-24 10:09 GMT

అమెరికాలో కరోనావైరస్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. వేలాది సంఖ్యలో కేసులు, మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అమెరికాలో గత 24 గంటల్లో 3 వేల 71 మంది ప్రాణాలు కోల్పోగా, 25 వేల 90 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇక్కడ 8 లక్షల 86 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు మరణాల సంఖ్య 50 వేల 243 గా ఉంది. ఇక ఆర్ధిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని 484 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని యుఎస్ పార్లమెంట్ శుక్రవారం ఆమోదించింది.

దీనితో నష్టాన్ని ఎదుర్కొనే వ్యాపారవేత్తలకు రుణాలు ఇచ్చే పథకాన్ని తిరిగి ప్రారంభిస్తారు. ఈ ప్యాకేజీ ఆసుపత్రులకు , పరీక్షా కార్యకలాపాలకు నిధులు కూడా అందిస్తుంది. ఈ ప్యాకేజీ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సపరేట్ బిల్లును ను కూడా తీసుకువచ్చారు, దీనిని ప్రతినిధుల సభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా కరోనా సంక్షోభానికి అమెరికా ప్రభుత్వం జారీ చేసిన నాల్గవ సహాయ ప్యాకేజీ ఇది.

Tags:    

Similar News