చైనా ధనవంతుడు జాక్‌మా అరెస్టంటూ రూమర్లు.. నిమిషాల్లో లక్ష 97 వేల కోట్ల రూపాయలు ఆవిరి..

Jack Ma: చైనా కుబేరుడు, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా అరెస్టు అనే వార్త.. చైనా స్టార్‌ మార్కెట్లను వణికించింది.

Update: 2022-05-05 11:55 GMT

చైనా ధనవంతుడు జాక్‌మా అరెస్టంటూ రూమర్లు.. నిమిషాల్లో లక్ష 97 వేల కోట్ల రూపాయలు ఆవిరి..

Jack Ma: చైనా కుబేరుడు, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా అరెస్టు అనే వార్త.. చైనా స్టాక్‌ మార్కెట్లను వణికించింది. ఈ వార్త వచ్చిన నిమిషాల్లో అక్షరాలా 26 బిలియన్‌ డాలర్ల జాక్‌ మా కంపెనీల షేర్లు ఆవిరయ్యాయి. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే లక్షా 97వేల కోట్ల రూపాయలను జాక్‌మా కోల్పోయారు. చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్‌లో 'మా' అరెస్టు అనే వార్తే ఈ జాక్‌ షేర్ల పతనానికి కారణమయ్యింది. తీరా అరెస్టయిన వ్యక్తి ఐటీ కంపెనీలో హార్డ్‌వేర్‌ రీసెర్చ్‌ విభాగంలో అధికారి అని.. గ్లోబల్‌ టైమ్స్‌ చావు కబురు చల్లగా చెప్పింది. అప్పటికే ఈ కామర్స్‌ సంస్థ అధినేత జాక్‌ మాకు భారీ నష్టం వాటిల్లింది. హాంగ్‌కాంగ్‌ స్టాక్‌ ఎక్స్చేంజీలో అలీబాబా షేర్లు 9.4 శాతం పడిపోయాయి.

తాజాగా చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌లో మా అనే ఇంటి పేరు ఉన్న వ్యక్తి అరెస్టు అయ్యారంటూ ఓ వార్తను ప్రసారం చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన ఉల్లంఘనలకు పాల్పడడంతోనే అతడిని హాంగ్‌ఝూ నగరంలో అరెస్టు చేసినట్టు వివరించింది. అయితే అరెస్టు అయిన వ్యక్తి జాక్‌మా అనే అంతా అనుకున్నారు. అందుకు కారణం జాక్‌మా ఈ కామర్స్‌ సంస్థ అలీబాబా ప్రధాన కార్యాలయం అక్కడే ఉంటుంది. పైగా జాక్‌మా జన్మించింది కూడా ఈ నగరంలోనే. దీంతో ఈ వార్త హాంగ్‌కాంగ్‌ షేర్‌మార్కెట్లను షేక్‌ చేసింది. ఏకంగా అలీబాబా షేర్లు 9.4 శాతానికి పడిపోయాయి. దీంతో నిమిషాల్లో జాక్‌మాకు లక్షా 97వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

అయితే ఈ విషయమై గ్లోబల్‌ టైమ్స్‌ మాజీ ఎడిటర్‌ హు షిజిన్‌ వివరణ ఇచ్చారు. పోలీసులు అరెస్టు చేసింది జాక్‌ మాను కాదన్నారు. దీనిపై గ్లోబల్‌ టైమ్స్‌ చావు కబురు చల్లగా చెప్పింది. తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. అరెస్టు అయిన వ్యక్తి స్థానిక ఐటీ కంపెనీలో హార్డ్‌వేర్‌ రీసెర్చి విభాగంలో పనిచేస్తున్నట్లు పేర్కొంది. అతడు 1985లో జన్మించాడని వివరించింది. బయట శక్తులు అతడికి బ్రెయిన్‌వాష్‌ చేసి చైనా వ్యతిరేక కార్యకలాపాల్లో నిమగ్నమయ్యేట్లు చేశాయని వెల్లడించింది. అతడు పుట్టిన సంవత్సరం ఆధారంగా చూస్తే జాక్‌మా కంటే 20ఏళ్ల చిన్నవాడు. దీంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకొన్నారు. గ్లోబల్‌ టైమ్స్‌ వివరణ తర్వాత అలీబాబా షేర్లు వేగంగా పుంజుకొన్నాయి

2020లో చైనా బ్యాంకులు, ప్రభుత్వ తీరుపై జాక్‌ మా విమర్శలు గుప్పించాడు. బ్యాంకింగ్‌ విధానాల్లో సంస్కరణలు తేవడం లేదని, బ్యాంకులను తాకట్టు దుకాణాల్లా ప్రభుత్వం వాడుకుంటోందని జాక్‌మా ఆరోపించారు. ఆ తరువాత జాక్‌మా కనిపించకుండా పోయారు. దీనిపై అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ తరువాత జాక్‌మా అడపా దడపా కనిపించినా అవి కూడా చైనా ప్రభుత్వం విడుదల చేసిన వీడియాలే దీంతో జాక్‌మా ఏమయ్యాడన్నది ఇప్పటికీ తెలియాదు. అయితే జాక్‌మా విమర్శలు గుప్పించిన తరువాత బీజింగ్‌ వర్గాలు జాక్‌మా వ్యాపారాలపై కన్నేశాయి. జాక్‌మా ప్రధాన హోల్డింగ్‌ సంస్థ యాంట్‌కు ప్రాజెక్టులు రాకుండా ప్రభుత్వం అడ్డుకున్నది. దీంతో జాక్‌మా షేర్లు భారీగా పడిపోయాయి.

Tags:    

Similar News