కాల్పుల విరమణను ప్రకటించిన ఆఫ్ఘన్ తాలిబన్

ఆఫ్ఘన్ తాలిబన్ మూడు రోజుల కాల్పుల విరమణను ప్రకటించింది. ఈద్ సందర్బంగా కాల్పుల విరమణ ప్రకటించింది.

Update: 2020-05-25 06:52 GMT

ఆఫ్ఘన్ తాలిబన్ మూడు రోజుల కాల్పుల విరమణను ప్రకటించింది. ఈద్ సందర్బంగా కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ మేరకు ఆఫ్ఘన్ తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రతినిధి ఆదివారం సమాచారం ఇచ్చారు. ఇందుకు సంబంధించి తాలిబాన్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. "మన దేశస్థులు ఈద్ ను సులభంగా, శాంతియుతంగా జరుపుకోవాలని ఈ నిర్ణయం తీసుకుంది" అని చెప్పారు. ఇందుకోసం ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ (తాలిబాన్ ఆక్రమిత భూభాగం పేరు) ముజాహిదీన్లందరికీ మూడు రోజులు కాల్పుల విరమణ నిర్వహించాలని ఆదేశించింది. అయితే ఈ సమయంలో, శత్రువు దాడి చేస్తే మాత్రం తిరిగి సమాధానం చెప్పాలి అని ఆదేశించింది. అలాగే తాలిబాన్లు ప్రభుత్వం నియంత్రణలో ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదని సదరు ప్రతినిధి చెప్పారు.

ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని తాలిబాన్ ప్రకటనను స్వాగతించారు. ఈ మేరకు ఇలా పేర్కొన్నారు ఘని 'నేను తాలిబాన్ కాల్పుల విరమణను స్వాగతిస్తున్నాను. నా సైన్యాన్ని (ఆఫ్ఘన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్) మూడు రోజులు కాల్పుల విరమణను అనుసరించాలని, దాడి చేసినప్పుడు మాత్రమే స్పందించాలని నేను ఆదేశిస్తున్నాను.' అని అన్నారు. మరోవైపు UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ , నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ కూడా తాలిబాన్ నిర్ణయాన్ని స్వాగతించారు.


Tags:    

Similar News