త్వరలో భూమికి సమీపానికి తోకచుక్క.. మళ్లీ 50వేల ఏళ్ల తరువాతే..

Comet: అంతరిక్షంలో భారీ అరుదైన తోకచుక్క ఒకటి త్వరలో భూమిని పలకరించబోతోంది.

Update: 2023-01-07 14:00 GMT

త్వరలో భూమికి సమీపానికి తోకచుక్క.. మళ్లీ 50వేల ఏళ్ల తరువాతే..

Comet: అంతరిక్షంలో భారీ అరుదైన తోకచుక్క ఒకటి త్వరలో భూమిని పలకరించబోతోంది. గతేడాది మార్చిలో మొదటిసారి జూపిటర్‌ను దాటుకుని వెళుతుండగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సీ-2022ఈ3 అనే పేరు పెట్టారు. ఈ తోకచుక్క 50 ఏళ్ల తరువాత భూమికి అత్యంత సమీపానికి రాబోతోంది. ఇది జనవరి 12న సూర్యుడిని చుట్టి.. ఫిబ్రవరి 1న భూమికి చేరువగా రానున్నది. దీన్ని నేరుగా కళ్లతో చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే అదే సమయంలో పౌర్ణమి సమీపిస్తున్నది. దీంతో చంద్రుడి వెలుగుల్లో కనిపిస్తుందా? లేదా? అంటే.. కష్టమేనంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ.. ఇది భూమి సమీపంలోకి వచ్చినప్పుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. సుమారు కిలోమీటరు పరిమాణంలో ఉండే ఈ తోక చుక్క.. మళ్లీ 50వేల ఏళ్ల తరువాతే కనిపిస్తుందని.. ఇప్పుడే చూసేయాలని చెబుతున్నారు. 

Tags:    

Similar News