అమెరికాలో కరోనా మరణాలు: 3 యుద్ధాలతో సమానం

Update: 2021-02-23 10:54 GMT

అమెరికాలో కరోనా మరణాలు: 3 యుద్ధాలతో సమానం

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలం అంతఇంత కాదు ఏడాదిలోనే లక్షలాది మంది ఈ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. యూఎస్‌లో కోవిడ్ మరణాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో నమోదు అయిన మొదటి మరణం నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య 5లక్షలకు చేరింది. దీనికి సంబంధించిన వివరాలను జాన్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ గణాంకాలు వెల్లడించాయి. అమెరికాలో రెండో ప్రపంచ యుద్ధం, కొరియా, వియత్నాం యుద్దాల్లో మొత్తం ఎంత మంది మరణించారో కోవిడ్ కారణంగా ఒక్క ఏడాదిలోనే అంతమంది మరణించినట్టు యూనివర్శిటీ పేర్కొంది.

మహమ్మారికి బలైన అమెరికన్లకు సంతాపంగా వైట్ హౌజ్‌లో అధ్యక్షుడు బైడెన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. రాబోయే ఐదు రోజుల పాటు ఫెడరల్ భవనాలపై జాతీయ పతాకాన్ని అవతనం చేయాలని ఆయన ఆదేశించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరనా మహమ్మారి కారణంగా 2.5 మిలియన్ల మంది మరణించారు. అందులో 20శాతం మరణాలు అమెరికా నుంచే సంభవించినట్టు తెలిపింది. 

Tags:    

Similar News