Kenya: తెగిన డ్యామ్.. 42 మంది మృతి..

Kenya: కెన్యాలో భారీ వర్షాలు, వరదలకు ఓ డ్యామ్ తెగిపోయి బీభత్సం సృష్టించింది.

Update: 2024-04-29 13:45 GMT

Kenya: తెగిన డ్యామ్.. 42 మంది మృతి..

Kenya: కెన్యాలో భారీ వర్షాలు, వరదలకు ఓ డ్యామ్ తెగిపోయి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. నకురు కౌంటీలోని మాయి మహియు పట్టణ సమీపంలోని డ్యామ్‌లో వరద తీవ్రతకు కట్ట తెగిపోయింది. వరదంతా సమీపంలోని ఊళ్లను ముంచెత్తింది. దీంతో పెద్దఎత్తున ఇళ్లు కొట్టుకుపోయాయి. రోడ్లు తెగిపోయాయి. విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగి.. ఆ వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. ఇళ్లు కొట్టుకుపోవడంతో ప్రజలు కూడా వరద తాకిడికి కొట్టుకుపోయి బురదలో చిక్కుకుపోయారు.

ఇప్పటి వరకు 42 మంది మృతదేహాలకు వెలికి తీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇంకా చాలా మంది ఆచూకీ లభించలేదు. ఇళ్ల శిథిలాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదలో మృతదేహాల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

కెన్యాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో గడిచిన రెండు నెలల్లో 120 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా డ్యామ్ తెగిపోవడంతో 24 వేలకు పైగా ఇళ్లు నీట మునిగాయి.. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బీభత్సంతో కెన్యాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. 

Tags:    

Similar News