Operation Kaveri: వేగంగా కొనసాగుతున్న ఆపరేషన్ కావేరి.. మొదటి బ్యాచ్‌లో 360 మంది

Operation Kaveri: షిప్‌లో వస్తున్న మరో బ్యాచ్

Update: 2023-04-27 05:04 GMT

Operation Kaveri: ముమ్మరంగా సాగుతున్న ఆపరేషన్‌ కావేరి.. సుడాన్‌ నుంచి సౌదీ చేరుకున్న మరో 135 మంది

Operation Kaveri: సుడాన్‌లో చిక్కుకున్న భార‌తీయుల త‌ర‌లింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. సూడాన్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ‍కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌ కావేరి' వేగంగా కొనసాగుతోంది. మొదటి బ్యాచ్‌లో సూడాన్ నుంచి 360 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. మొత్తంగా జెడ్డాకు చేరుకున్న 534 మందిలో 360 మంది వాణిజ్య విమానంలో బుధవారం రాత్రి ఢిల్లీకి వచ్చేశారు. ఆపరేషన్ కావేరీ సాయంతో సూడాన్‌ నుంచి మొదటి బ్యాచ్ న్యూఢిల్లీకి చేరుకుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. జైశంకర్ తన సౌదీ అరేబియా కౌంటర్‌తో మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. సుడాన్ నుంచి వచ్చిన మొదటి బ్యాచ్ లో గుంటూరు జిల్లా చీరాలకు చెందిన విష్ణువర్దన్ కూడా ఉన్నారు. సూడాన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని విష్ణువర్థన్ అంటున్నారు. తిరిగి ఇంటికి వస్తామనుకోలేదన్నారు. మరో టీమ్ షిప్ లో వస్తుందన్నారు. 

Tags:    

Similar News