Pakistan: మసీదులో బాంబు పేలుడు.. 25మంది మృతి, 120మందికి గాయాలు..

Pakistan: ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్‌... ఆ దేశం ఉగ్ర రక్కసి వణికిస్తోంది.

Update: 2023-01-30 11:09 GMT

Pakistan: మసీదులో బాంబు పేలుడు.. 25మంది మృతి, 120మందికి గాయాలు..

Pakistan: ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్‌... ఆ దేశం ఉగ్ర రక్కసి వణికిస్తోంది. తాజాగా పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. వాయువ్య పాకిస్థాన్‌లోని కీలక నగరం పెషావర్‌లోని మసీదుపై ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో పైకుప్పు కుప్పకూలింది. మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిలో అక్కడికక్కడే 25 మందికి పైగా మృతి చెందారు. మరో 120 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు 39 మందిని అంబులెన్స్‌లో తీసుకొచ్చినట్టు పెషావర్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

అయితే ఇప్పటివరకు దాడికి బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు. ఇది ప్రధానంగా తెహ్రీక్‌ ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌-టీటీపీ ప్రభావమున్న ప్రాంతం. పైగా మసీదు ప్రాంగణంలో పోలీసు హెడ్‌ క్వార్టర్‌ ఉంది. ఇటీవల కాలంలో టీటీపీ ఉగ్రవాదులు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేస్తున్నారు., దీంతో టీటీపీ హస్తం ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2018 తరువాత ఇదే అత్యంత ఘోరమైన దాడిగా పాక్‌ అధికారులు చెబుతున్నారు. 2018లో పెషావర్‌లోనే షిత్తీ మసీదుపై ఐసిస్‌ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ డెడ్లీ ఘటనలో ఏకంగా 64 మంది పౌరులు చనిపోయారు.

Tags:    

Similar News