Morocco Earthquake: మొరాకోలో భూకంపం విధ్వసం.. 2000 మందికి పైగా మృతి..

Morocco Earthquake: భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదు

Update: 2023-09-10 04:41 GMT

Morocco Earthquake: మొరాకోలో భూకంపం విధ్వసం.. 2000 మందికి పైగా మృతి.. 

Morocco Earthquake: భారీ భూకంపంతో మొరాకో చిగురుటాకులా వణికింది. మొరాకోను భూకంపం అతలాకుతలం చేసింది. భూకంపం మృతుల సంఖ్య 2వేలు దాటింది. అర్ధరాత్రి సంభవించిన భూ ప్రకంపనలతో జనం ఒక్కసారిగా ఉలికిపడి వీదుల్లోకి పరుగులు తీశారు. వేలాది భవనాలు నేలమట్టం కాగా.. శిధిలాల్లో చిక్కుకుని 2000 మందికిపై పైగా మరణించారు..

ప్రకృతి విపత్తులో 2,012 మంది ప్రాణాలు కోల్పోగా, 2,059 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆఫ్రికా ఖండం ఉత్తరభాగం చరిత్రలో ఇంత పెద్ద భూకంపం ఎప్పుడూ సంభవించలేదు. తీరప్రాంత నగరాలైన రబాత్, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. ఘటనాస్థలాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైందని, భూకంపం సంభవించిన 19 నిమిషాల తర్వాత తీవ్రత 4.9గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకటించింది. భూకంప కేంద్రం అల్‌ హౌజ్‌ ప్రావిన్స్‌లోని ఇఘిల్‌ పట్టణం సమీపంలో, మర్రకేశ్‌కు దక్షిణాన సుమారు 70 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతున ఉందని జియోలాజికల్‌ సర్వేలో వెల్లడయ్యింది. తక్కువ లోతులో సంభవించే ఇటువంటి భూకంపాల తీవ్రత అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది.

Tags:    

Similar News