చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి, 22 మందికి గాయాలు
China: పొగ మంచు కారణంగా రోడ్డు కనిపించక ప్రమాదం
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి, 22 మందికి గాయాలు
China: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు చైనాలోని జియాంగ్సీ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22మంది గాయపడ్డారు. నాన్చంగ్ కౌంటీ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 17మంది మరణించారు. 22మంది గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు,
పొగమంచు కారణంగా రోడ్డు కనిపించక ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత.. నాన్చంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసులు.. ప్రజలకు సూచనలు జారీ చేశారు. ఈ ప్రాంతాన్ని పొగమంచు కప్పేసిందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
పొగమంచు కారణంగా రోడ్లు కనిపించడం లేదు. విజిబులిటీ తక్కువగా ఉంది. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని . ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.. చైనాలో రోడ్లు భద్రత అత్యంత దారుణంగా ఉంటుంది. ఈ దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గత నెలలో పొగమంచు కారణంగా.. ఓ ప్రధాన హైవే మీద 100కుపైగా వాహనాలు ఢీకొట్టుకున్నాయి.