Indian students: హమ్మయ్యా..సేఫ్.. ఇరాన్ నుంచి క్షేమంగా బయటపడ్డ భారతీయ విద్యార్థులు.. ఎక్కడకు రీచ్ అయ్యారంటే?
Indian students: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రం అవుతోంది.
Indian students: హమ్మయ్యా..సేఫ్.. ఇరాన్ నుంచి క్షేమంగా బయటపడ్డ భారతీయ విద్యార్థులు.. ఎక్కడకు రీచ్ అయ్యారంటే?
Indian students: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రం అవుతోంది. ఈ క్రమంలో అక్కడున్న భారతీయులను తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగానే 110 మందితో కూడిన మొదటి బ్యాచ్ ఇప్పటికే అర్మేనియం చేరుకుంది. భారత విదేశాంగశాఖ మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ ప్రాంతంలో నెలకున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భద్రతాకారణాల ద్రుష్ట్యా భారతీయులను తరలిస్తున్నట్లు విదేశాంగశాఖ పేర్కొంది. సొంత రవాణా సదుపాయం ఉన్నవాళ్లంతా ఈ ప్రాంతాన్ని వీడాలని కోరింది. ఈ క్రమంలో 110 మంది పౌరులను తొలి బ్యాచ్ కింద అక్కడి నుంచి తరలించినట్లు వెల్లడించింది. వీరంతా తాజాగా అర్మేనియం చేరుకున్నారు. బుధవారం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇక పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, మన విద్యార్థులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఇక ఇజ్రాయెల్ జరుపుతున్న పేలుళ్లతో టెహ్రాన్ నగరం దద్దరిల్లుతోంది. ఈనేపథ్యంలో అక్కడి మన ఎంబసీ అడ్వైజరీని జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడాలని సూచించింది. టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని పేర్కొంది. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులను సంప్రదించాలని కోరింది.