వ్యవసాయ కూలీగా సబ్ రిజిస్ట్రార్..!

Update: 2020-08-14 12:08 GMT

Sub registrar turns agriculture labour on holidays: ఆమె ఒక ప్రభుత్వ అధికారిణి, ఆకు పచ్చ కలంతో సంతకం చేసేంత హోదా హలం పట్టి పొలంలో పని చేసేంత ఓపిక. రెండు జిల్లాలకు సబ్ రిజిస్ట్రార్ ఆమే కానీ వారమంతా తన విధి నిర్వహణలో గడిపే ఆ అధికారిని సెలవు దినాలు మాత్రం సేద్యానికే అంటుంది !! ప్రతీ ఆదివారం వ్యవసాయ కూలీగా మారి అన్నదాతల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్న ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పై ప్రత్యేక కథనం.

ఈ మహాళ రైతు కూలీ ఎవరో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు, ఆమె మరెవరో కాదు ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈ రెండు జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్...! రైతు కుటుంబం నుండి వచ్చి ఉన్నతస్థాయికి ఎదిగిన ఈ అధికారిణి సెలవు దినాల్లో వ్యవసాయ పనులు చేస్తూ అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. రామచంద్రపురం గ్రామానికి చెందిన తస్లీమా ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తుంది. ఒక వైపు సామజిక సేవా కార్యమాలు మరో వైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తు సెలవు దినాలలో తన స్వగ్రామం ములుగు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన దూడబోయిన రమేష్ అనే రైతు వరి పొలంలో దుక్కి దున్నినాట్లువేసి రోజంతా కూలీ పని చేస్తున్నారు.

దినసరి కూలీగా మహిళలతో కలిసి పొలం పనులు చేస్తూ రోజంతా పని చేసినందుకు సాధారణ కూలీల లాగే 300రూపాయల కూలీ తీసుకున్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబం నుండి వచ్చిన తనకు అన్నదాత కష్టాలు ఎలా ఉంటాయో తెలుసని ఎండనక, వానానక, ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేసే రైతులకు భరోసా కల్పించాలని కోరారు. ప్రపంచంలో రైతు జీవితమే అత్యున్నతమైన జీవితమని వారు లేకుంటే నేడు ఈ దేశానికె అన్నం లేదన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని కరోనా ప్రభావంతో కూలీలు దొరకడం లేదని, దొరికిన వారికి ఇవ్వడనికి డబ్బులు లేని పరిస్థితుల్లో యువతి, యువకులు రైతన్నకు అండగా నివవాలని అంటున్నారు తస్లీమా. తస్లీమా సెలవు దినాన కూలీ పని చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఐదేళ్లుగా ఆమె ఇలాగే పనిచేస్తున్నారు. ఓ పేద రైతు కుటుంబంలో పుట్టిన తస్లీమా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. ప్రపంచంలో అత్యుత్తమ జీవితం రైతుదే అని బలంగా నమ్ముతారామె. రైతు లేకుంటే అన్నం లేదని నమ్మే ఆమె రైతును ప్రతి ఒక్కరు గౌరవించి సమాజంలో సముచిత స్థానం కల్పించాలని చెబుతారు.

Full View


Tags:    

Similar News