Farmers Facing Problems : వర్షాలు లేక విత్తనాలు వేయని విజయనగరం రైతులు

Update: 2020-07-15 11:24 GMT

Farmers Facing Problems : రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించడంతో రైతులు పంటలు వేయడానికి సిద్దమౌతుంటే విజయనగరం జిల్లాలో మాత్రం దానికి బిన్నంగా వర్షాల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. గత నెల రోజులుగా వర్షాలు దోబూచులాడుతూ మురిపించి మొహం చాటేస్తున్నాయి తప్పా చినుకు రాలటం లేదు. రుతుపవనాలు రాకతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పదే పదే ప్రకటించినా ఇప్పటి వరకు జిల్లాలో చిరు జల్లులు మాత్రమే కురిసాయి. విజయనగరం జిల్లాలోని రైతుల కష్టాలపై ప్రత్యేక కధనం.

విజయనగరం జిల్లాలో తీవ్ర వర్షాభావం మరొపక్క కరువు తాండవిస్తోంది. గత ఏడేనిమిది నెలలుగా వర్షాలు లేకపోవడంతో జిల్లాలోని రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రుతుపవనాల రాకతోనైనా వర్షాలు కురుస్తాయి పంటలు పండించకోవచ్చన్న రైతుల ఆశలు ఆడియాశలుగా మారాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌ మొదలవ్వడంతో పంటలను వెసేందుకు రైతులు సిద్దమైయ్యారు. అయితే అందుకు తగ్గ వర్షాలు లేక పంటలను వేసేందుకు పొలాలను కూడా సిద్దం చెయ్యలేక వరుణుడి కోసం ఆకాశం వైపు చూస్తున్నారు.

రుతుపవనాలు రాకతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపినప్పటికి చినుకు జాడ కూడా జిల్లా వైపు చూడలేదు. కనీసం తేలికపాటి జల్లులు పడిన విత్తనాలు నాటేందుకు సిద్ధం అయ్యారు. కొన్ని చోట్ల చిరుజల్లులు తప్పా మోస్తారు వర్షం కూడా కురువలేదు. దీంతో పొలాలు ఇంకా బీళ్లుగానే ఉన్నాయి. అసలే జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా కరువు తాండవిస్తున్నది. సరైన వర్షాలు లేక జిల్లాలోని తోటపల్లి మినహ అన్ని రిజర్వార్లు ఎండిపోయి బోసిగా దర్శనమిస్తున్నాయి.

వర్షాలు లేక, రిజర్వాయర్ నీళ్లు రాక వేసిన పంటలు ఎండిపోయి పెట్టుబడుల కూడా రాక అన్నదాతలు నష్టాలను చవిచూస్తున్నారు. గత కొన్నేళ్ళుగా విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సాగు అంతంత మాత్రంగానే సాగుతోంది. దీనికి తోడు వర్షాలు ఎడ మోకం పెడితే ఈ ఖరీఫ్ లో కూడా పంటలు వేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల కురిసిన కాస్తా వర్షాలతో కొంతమంది రైతులు దుక్కులు చేసుకొని పెసర, కంది, జొన్న వంటి పంటలు వేశారు. వీటికి వర్షాలు లేకపోవడంతో వేసిన పంటలుకూడా మొలకెత్తే పరిస్థితి లేదు. ఈ తరుణంలో వర్షాల కోసం రైతులు వేయి కళ్ళతో ఆకాశం వైపు చూస్తున్నారు.

రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినా విజయనగరం జిల్లాలో వర్షాలు మాత్రం ఇదిగో అదిగో అంటూ దోబూచులాడుతున్నాయి. మరో పక్క తొలకరి వాన ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుల కళ్ళు కాయలు కాస్తున్నాయి. 

Full View


Tags:    

Similar News