Cattle Hostels in Siddipet : పథకాల ప్రయోగశాల సిద్ధిపేటలో మరో ప్రయోగం

Update: 2020-07-08 09:53 GMT

సాగు రంగంలో పశువులు, జీవాల పెంపకం వృద్ధి, వాటి సంరక్షనకు ఒక వినూత్న కార్యక్రమానికి సిద్ధిపెట నియోజకవర్గం వేదికైంది. మనుష్యులకు లాగానే అక్కడ పశువులకు, జీవాలకు హాస్టల్లను ఏర్పాటు చేశారు పశువులకు హాస్టల్లేంటి అని ఆశ్చర్యపోతున్నారా ఈ పశువుల హాస్టళ్లు, వాటి ప్రత్యేకతలపై ప్రత్యేక కథనం మీకోసం

తెలంగాణ రాష్ట్రం లో ఏ అభివృద్ధి కార్యక్రమైనా, ఏ కొత్త ఆలోచన పురుడు పోసుకున్నా అది విజయవంతం కావాలంటే ఆ కార్యక్రమాలను సిద్దిపేట నియోజకవర్గం లో ప్రయోగించాల్సిందే. ఇక్కడ విజయవంతమైతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకాలు, కార్యక్రమాలు వంద శాతం విజయవంతం అయినట్లే అనేది ఒక సెంటిమెంగ్ గా వస్తున్న విషయం. అలా ఏర్పాటైనవే సిద్దిపేటలోని పశువుల వసతి గృహాలు.

ఈ"వసతి గృహాలు" పాడి పశువులు అనారోగ్యానికి గురికాకుండా చూడటం, పాల ఉత్పత్తి పెంచడంతో పాటు పల్లెల్లో మెరుగైన పారిశుధ్య నిర్వహణ లక్ష్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా వీటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు మంత్రి హరీష్ రావు ఇప్పటికే నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్‌, ఇర్కోడ్‌, నర్మెట మూడు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా సాముహిక గొర్రెల పాకలు నిర్మించడంతో మంచి సత్ఫలితాలనిచ్చాయి. దీని వల్ల గ్రామానికి చెందిన అన్ని గొర్రెలు ఒకేచోట ఉండటంతో కాపలా సులభమైంది. ఊర్లలోనూ పారిశుద్ధ్యం మెరుగైంది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు పశువులకూ "వసతి గృహాలు" హాస్టల్స్‌ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని పొన్నాల,ఇరుకోడ్, మిట్టపల్లి,ఇబ్రహీంపూర్ జక్కపూర్,గుర్రాలగొంది నర్మెట,గట్లమాల్యాల గ్రామాలలో ఈ పశువుల హాస్టల్ నిర్మాణాలు చేపట్టారు. అతి త్వరలోనే వీటిని పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు అధికారులు.

ఈ హాస్టల్స్ నిర్మాణంతో పశువులను మేత కోసం తీసుకెళ్లి రావడం తప్పుతుండడంతో పాటు ఇతరత్రా కారణాలతోనూ పశుపోషణకు దూరం కాకుండా ఉండచ్చని ప్రతిపాదిత పశువుల హాస్టల్స్‌-వసతి గృహాలు ఆ సమస్యలకు పరిష్కారం చూపనున్నాయని, ఇవి తమకు ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు రైతులు. ఒక్కో పశువుల హాస్టల్ ను 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. మారే వాతావరణానికి పశువులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు రూఫ్లు, ఫ్యాన్లు, టార్పిలిన్ లు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో పశువుల హాస్టళ్ల పనులు పూర్తి అవుతాయని అధికారులు చెబుతున్నారు.

Full View



Tags:    

Similar News