వారెవ్వా...సంగారెడ్డిలో జగ్గారెడ్డి న్యూ ఫార్ములా?

వారెవ్వా...సంగారెడ్డిలో జగ్గారెడ్డి న్యూ ఫార్ములా?
x
Highlights

ఆయన రూటే సెపరేటు. ఆయన మాటే యమ ఘాటు. పొజిషనైనా, అపోజిషనైనా, పవరైనా, పొగరైనా, తాను దిగనంత వరకేనంటాడు. వన్‌ హి స్టెప్‌ ఇన్, హిస్టరీ రిపీట్ అంటాడు....

ఆయన రూటే సెపరేటు. ఆయన మాటే యమ ఘాటు. పొజిషనైనా, అపోజిషనైనా, పవరైనా, పొగరైనా, తాను దిగనంత వరకేనంటాడు. వన్‌ హి స్టెప్‌ ఇన్, హిస్టరీ రిపీట్ అంటాడు. ఇప్పుడు కూడా, చరిత్ర తిరగరాస్తానంటూ మీసం మెలేస్తున్నాడు. పొలిటికల్‌ కింగ్‌లకే దిమ్మతిరిగేలా ఆయన ఒక ఫార్ములా రెడీ చేశాడన్న ప్రచారమొకటి జరుగుతోంది. అది నిజమో కాదో తెలీదు కానీ, ఆ ఫార్ములా మాత్రం, రాజకీయ పండితులకే దిమ్మతిరిగేలా వుంది. ఏంటది?

జగ్గారెడ్డి. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే. జగ్గారెడ్డి రాజకీయ ప్రస్థానం అందరికి తెలిసిందే. అప్పుడు ఇప్పుడు ఒకే ఒక్కడుగా పైటర్ రాజకీయాల్లో సెంటర్ ఆప్ అట్రాక్షన్. జగ్గారెడ్డి మీద అధికార టీఆర్ఎస్‌ పార్టీ గతంలో సీరియస్ గానే ఉన్నా, ఇటీవల జిల్లాల్లో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో, చూసీచూడనట్లు వ్యవహరిస్తోందట. టీఆర్ఎస్ విషయంలో కూడా జగ్గన్న అప్పట్లో ఉన్నంత దూకుడుతో లేరట. ఫీల్డ్ లో ఉండే నేతలకే ఆ ప్రాబ్లమ్స్ తెలుసనే జగ్గారెడ్డి, కొంతకాలంగా సైలంట్ గా ఉంటున్నారు. గెలిచిన మొదట్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ ఫ్యామిలీకి అనుకూలంగా మాట్లాడిన జగ్గారెడ్డి తీరును చూసి, టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం జరిగినా, అలాంటిదేం జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తూ వస్తోంది. జిల్లాకు చెందిన మంత్రి హరీష్ రావు, సంగారెడ్డి నియోజకవర్గంపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టారు. వారంలో కనీసం ఒక్కసారైనా సంగారెడ్డిని చుట్టి వెళుతున్నారు. జగ్గారెడ్డి నియోజకవర్గంలో తిరగక పోవడంతో, ఇదే అదనుగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ సైతం, ఆయన వెంట తిరుగుతూ అధికారుల్లో, నేతల్లో పలుకుబడిని పెంచుకుంటున్నారట. దీనికి తోడు సంగారెడ్డి కాంగ్రెస్ క్యాడర్‌ను ఖాళీ చెయ్యాలని మంత్రి హరీష్ స్కెచ్ గీయడంతో ఇటీవలే జగ్గారెడ్డికి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు, కీలక అనుచరులంతా మంత్రి హరీష్ రావు సమక్షంలో, టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. మరికొంతమంది కూడా టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇదే ఇప్పుడు సంగారెడ్డి పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇదిలావుంటే, జగ్గారెడ్డి మాత్రం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను చాలా లైట్‌ తీసుకుంటున్నారట. వెళ్లే వాళ్ళను అపొచ్చు కానీ, వెళదామని పక్కాగా ప్లాన్ చేసుకున్నవాళ్లను ఆపడం కష్టమంటున్నారట. వెళ్లే వాళ్ళు వెళ్తారు, వుండేవాళ్లు వుంటారని వేదాంతం చెబుతున్నారట. గతంలో తన ముఖ్య అనుచరులుగా ముద్ర పడ్డ కొందరు, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో వెళ్లారని, వారు పార్టీ మారడం వల్ల తనకు మంచే జరిగిందంటున్న జగ్గారెడ్డి, ఇప్పుడు వెళ్లిన వారి వల్ల కూడా తనకు మంచే జరుగుతుందని అభిప్రాయపడుతున్నారట. ఇంతకీ జగ్గారెడ్డి అనుకుంటున్న ఆ మంచేంటి?

జగ్గారెడ్డినే టిఆర్ఎస్ పార్టీకి టచ్ లో ఉంటున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ముందుగా తాము కండువాలు కప్పుకుంటే ఏం లాభమని, మంత్రితో అన్నారట జగ్గారెడ్డి క్యాడర్. మీరైతే ముందు రండి....ఫస్ట్ కమ్ ఫస్ట్ బెంచ్ అని హరీష్ అందరికి టిఆర్ఎస్ కండువాలు కప్పేసారు. అయితే జగ్గారెడ్డే ఆ క్యాడర్ ను టీఆర్‌ఎస్‌లోకి పంపారని ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత అన్నది వారికే చెప్పాలి. జగ్గారెడ్డే టిఆర్ఎస్‌తో, లోలోన సఖ్యతగా ఉంటే, తామే ముందుగా చేరితే పోలా అని క్యాడర్ భావించడంలో నిజమెంత? లెటస్ వెయిట్ అండ్ సీ...వాట్ విల్ హ్యాపెన్.


Show Full Article
Print Article
Next Story
More Stories