ప్రెగ్నెన్సీ సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..! చాలా హానికరం..

Pregnancy Period: తల్లికావడం ఒక అదృష్టం. దీనిని మహిళలందరు ఆస్వాదిస్తారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Update: 2021-12-22 11:30 GMT

ప్రెగ్నెన్సీ సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..! చాలా హానికరం..

Pregnancy Period: తల్లికావడం ఒక అదృష్టం. దీనిని మహిళలందరు ఆస్వాదిస్తారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంతో సరైన డైట్‌ మెయింటెన్‌ చేయాలి. పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.

మొదటి మూడు నెలల్లో వాంతులు, వికారం వంటి సమస్యలతో ఏదీ సరిగా తినలేకపోతారు. కుటుంబ సభ్యులు ఈ పరిస్థితిని గమనించి వారికి అండగా నిలవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమంది మహిళలు అతిగా తినడం చేస్తారు. దీనివల్ల వారు అజీర్ణం, గ్యాస్, కడుపుకు సంబంధించిన అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక మరికొంతమంది మహిళలు చాలా తక్కువగా తింటారు. దీని కారణంగా తల్లి శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. బిడ్డకు సరైన పోషకాహారం అందదు. గర్భిణులు వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదు. చాలా మంది స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు సొంత ఇష్టానుసారం ట్యాబ్లెట్లు తీసుకోవడం చేస్తారు. దీని కారణంగా వారు కడుపు నొప్పి, వాంతులు, తల తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కచ్చితంగా వైద్యుడి సలహా మేరకు మాత్రమే మందులు వేసుకోవాలి.

నిటారుగా పడుకోవడం వల్ల గర్భిణీకి శరీరంలో చాలా చోట్ల నొప్పి వస్తుంది. ఇందులో తుంటి, వెన్ను, మెడ నొప్పి ఉంటుంది. పొట్ట పెరగడం వల్ల నిద్రపట్టడంలో చాలా సమస్యలు ఎదురవుతాయి. గర్భధారణ సమయంలో పక్కకు తిరగి పడుకోవడం ఉత్తమం. గర్భధారణ సమయంలో చెప్పులు ధరించడం వల్ల పాదాలలో నొప్పి, వాపు వస్తుంది. అంతేకాదు అవి సరిగ్గా లేకుంటే నడవడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే వాటిని ధరించకుండా ఉండటమే మేలు. వైద్యుల సూచన మేరకు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది.

Tags:    

Similar News