ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? నష్టాలు ఇవే..

కూరలో ఎన్ని రకాల మసాలాలు వేసినా ఉప్పు వేయకపోతే ఆ కూర టేస్టీగా ఉండదని చెప్పేందుకు ఈ సామెత సరిగ్గా సెట్‌ అవుతుంది.

Update: 2025-01-30 15:30 GMT

ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? నష్టాలు ఇవే..

'అన్ని వేసి చూడు.. నన్ను వేసి చూడు' అని ఉప్పు గురించి ఒక సామెత ఉంటుంది. కూరలో ఎన్ని రకాల మసాలాలు వేసినా ఉప్పు వేయకపోతే ఆ కూర టేస్టీగా ఉండదని చెప్పేందుకు ఈ సామెత సరిగ్గా సెట్‌ అవుతుంది. అయితే కూరకు రుచిని ఇచ్చే ఉప్పును ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతుంటారు. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల గుండె పోటు మొదలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే విషయాన్ని చెబుతోంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఉప్పును తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. రోజులో 2 గ్రాముల కంటే తక్కువగానే ఉప్పును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాకాదని ఎక్కువగా తీసుకుంటే మాత్రం పలు సమస్యలు తప్పవని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇంతకీ ఉప్పు ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉప్పులోని సోడియం కంటెంట్‌ అధిక రక్తపోటుకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఉప్పును ఎక్కువగా తీసుకుంటే గుండెపోటుతో పాటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌కు దారితీసే అవకాశం ఉంటుంది. ఉప్పు తక్కువగా తీసుకుంటే గుండె కండరాల పనితీరును మెరుగవుతుంది. ఇక ఉప్పును ఎక్కువగా తీసుకుంటే మూత్ర పిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీంలో పేరుకుపోయిన సోడియంను ఫిల్టర్ చేయడంలో మూత్ర పిండాలు విఫలమవుతాయి.

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో నీరు ఎక్కువగా నిలిచిపోతుంది. ఇది ఉబ్బరం, వాపుకు దారితీస్తుంది. ముఖ్యంగా కాళ్లు, పాదాలు, చేతుల్లో నీరు చేరకుండా కాపాడుతుంది. అధిక సోడియం రక్త నాళాలను గట్టిపడడానికి కారణమవుతుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే వీలైనంత వరకు ఉప్పును తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News