Fruit And Vegetable Wash: కూరగాయలు, పండ్లను ఇలా కడిగితే..

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. కోరలు చాస్తోన్న కరోనాతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తుమ్మిన..

Update: 2020-06-25 13:10 GMT

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. కోరలు చాస్తోన్న కరోనాతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తుమ్మిన.. దగ్గిన భయపడిపోతున్నారు. అయితే అత్యవసర పనులు, జాబ్ కోసం చాలా మంది ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు. మరికొంత మంది కరోనా భయంతో నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు.. వారానికి కావాల్సిన కూరగాయలు..పండ్లను తెచ్చుకుంటున్నారు. అయితే కూరగాయలను శుభ్రం చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించలంటున్నారు ఆరోగ్యనిపుణులు.

ఉప్పు మరియు పసుపు కూరగాయలపై ఉండే క్రిములు, బ్యాక్టీరియాను నశింపజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు, పసుపుతో కూరగాయలను 20 నిమిషాలు కడిగితే వాటిపై ఉండే క్రిములు మరియు బ్యాక్టీరియా తొలిగిపోతయంటున్నారు. ముందుగా కూరగాయలను 15 నుంచి 20 నిమిషాలు పాటు కడిగి.. వాటిని మళ్లీ మంచినీటితో శుభ్రం చేయాలి. ఇక వాటిని 70-80 డిగ్రీల వేడిలో ఉడికించి తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక చర్మం పెలుసుగా ఉన్న వెజిటేబుల్స్ మరియు పండ్లు , టమోటోలు, బెర్రీస్ మరియు ద్రాక్షవంటి వాటిని చల్లగా ఉండే మంచి నీటితో కడగడం మంచిదంటున్నారు నిపుణులు. పెస్టిసైడ్స్ నివారించడానికి నీటిలో కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేయాలి.

అయితే ఈమధ్య కాలంలో చాల మంది కూరగాయలను.. సబ్బు, డెటాల్‌, శానిటైజర్లతో శుభ్రం చేయడంతో పాటు తుడిచి అరగంట పాటు ఎండబెడుతున్నారు. అయితే కూరలు, పండ్లు శుభ్రపరచడానికి డిటర్జెంట్స్ మరియు సబ్బు లాంటి వాటిని వాడకూడదంటున్నారు నిపుణులు. ఇవి వాడటం వల్ల పండ్లకు, వెజిటిటేబుల్స్ కు అట్టుకొన్న సబ్బులు సరిగా శుభ్రం చేకపోతే మరో రకంగా సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.


Tags:    

Similar News