Green Garlic: పచ్చి వెల్లుల్లిలో అద్భుత ఔషధ గుణాలు.. ఈ వంటకాలకు ప్రత్యేకం..

Update: 2021-12-14 02:56 GMT

పచ్చి వెల్లుల్లిలో అద్భుత ఔషధ గుణాలు.. ఈ వంటకాలకు ప్రత్యేకం..

Green Garlic: వెల్లుల్లి మన వంటిట్లో దొరికే అద్భుత ఔషధాల గని. భారతీయులు వంటలలో విరివిగా వాడుతారు. అంతేకాదు ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే దీనిని ప్రాచీనకాలం నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. మందుల తయారీలో వినియోగిస్తారు. దీనికి ఎన్నో వ్యాధులను నయం చేసే గుణం ఉంది. ముఖ్యంగా పచ్చివెల్లుల్లి ప్రభావవంతంగా పని చేస్తుంది. సాధారణంగా పచ్చి వెల్లుల్లిని స్ప్రింగ్ గార్లిక్ అని అంటారు.

దీని రుచి తేలికపాటిది, తక్కువ ఘాటుగా ఉంటుంది. మొగ్గ ఏర్పడటానికి ముందు ఆకుపచ్చ వెల్లుల్లి నేల నుంచి బయటకు వస్తుంది. దీనిని వంటలలో అద్భుత రుచికోసం వినియోగిస్తారు. పచ్చి వెల్లుల్లిని సూప్‌లు, లేదా సలాడ్‌లు, మాంసం రోస్ట్‌లు వంటి వంటకాలలో రుచిని మెరుగుపరచడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో అల్లిసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది.

జలుబు, దగ్గు, ఫ్లూని నివారిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. పచ్చి వెల్లుల్లి ఉండే అల్లిసిన్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతుంది. పరగడుపున వెల్లుల్లిని తింటే బాడీ మెటబాలిజం బాగుంటుందనీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయనీ, హైపర్ టెన్షన్, డయాబెటిస్‌ని నివారించవచ్చని పరిశోధనలో తేలింది. వెల్లుల్లి షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఏడు వారాల్లో సెరమ్ గ్లూకోజ్‌ని 57 శాతానికి తగ్గిస్తుంది. నెలన్నరలోనే టైప్-2 డయాబెటిస్ సమస్యల నుంచీ గట్టెక్కవచ్చు.

Tags:    

Similar News