Plastic Chemicals : ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ తాగుతున్నారా.. అయితే మీకు గుండెపోటు ఖాయం
Plastic Chemicals : ప్రతిరోజూ మనం ఉపయోగించే ప్లాస్టిక్ మన గుండెకు విషంగా మారుతోందా? తాజా పరిశోధనలు ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నాయి. ప్లాస్టిక్‌లో ఉండే ఈ ప్రమాదకరమైన రసాయనం గుండెపోటుకు ఎలా కారణమవుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
Plastic Chemicals : ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ తాగుతున్నారా.. అయితే మీకు గుండెపోటు ఖాయం
Plastic Chemicals : ప్రతిరోజూ మనం ఉపయోగించే ప్లాస్టిక్ మన గుండెకు విషంగా మారుతోందా? తాజా పరిశోధనలు ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నాయి. ప్లాస్టిక్‌లో ఉండే ఈ ప్రమాదకరమైన రసాయనం గుండెపోటుకు ఎలా కారణమవుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
నేటి ఆధునిక యుగంలో ప్లాస్టిక్ మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్‌ను మనం ఉపయోగిస్తూనే ఉన్నాం. అయితే, ఈ ప్లాస్టిక్‌లో దాగి ఉన్న ఒక ప్రమాదకరమైన రసాయనం మన ఆరోగ్యానికి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం, ప్లాస్టిక్‌లో ఉపయోగించే 'థాలేట్స్' (Phthalates) అనే ప్రత్యేక రసాయనం ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులతో సంభవించే మరణాలలో 13%కి కారణమవుతోంది. ఈ మరణాలలో అత్యధికంగా మన భారతదేశంలోనే నమోదవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
థాలేట్స్ ఒక రకమైన రసాయనం. దీనిని ప్లాస్టిక్‌ను మృదువుగా, సాగేలా చేయడానికి ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా ఆహార నిల్వ డబ్బాలు, నీళ్ల సీసాలు, పిల్లల బొమ్మలు, ఇతర గృహోపకరణాలలో కనిపిస్తుంది. ఈ రసాయనం నెమ్మదిగా విచ్ఛిన్నమై సూక్ష్మ కణాలుగా మారి గాలి, నీరు, ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరుతుంది.
పరిశోధన ఏం చెబుతోంది?
న్యూయార్క్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనం 'eBioMedicine' అనే వైద్య పత్రికలో ప్రచురించారు. పరిశోధన ప్రకారం, 2018లో ప్రపంచవ్యాప్తంగా 3.56 లక్షల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణించారు. వీటికి థాలేట్సే ప్రధాన కారణమని తేలింది. ఈ మరణాలలో అత్యధికంగా భారతదేశంలోనే (సుమారు 1 లక్షా 3 వేలకు పైగా) సంభవించాయి. ఆ తర్వాత చైనా, ఇండోనేషియా ఉన్నాయి. ముఖ్యంగా 55 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ ప్రమాదానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది.
భారత్‌కు ఎందుకీ పెను ముప్పు?
భారతదేశంలో ప్లాస్టిక్ ఉత్పత్తి, వినియోగం వేగంగా పెరుగుతోంది. ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా భారీ మొత్తంలో ఉత్పత్తి అవుతున్నాయి. దీనివల్ల ప్రజలు థాలేట్స్‌కు గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దక్షిణ ఆసియా, మధ్యప్రాచ్యం, తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాలు ఈ ప్రమాదం వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
థాలేట్స్ వల్ల కలిగే ఇతర ఆరోగ్య సమస్యలు
థాలేట్స్ కేవలం గుండె సంబంధిత వ్యాధులకు మాత్రమే కారణం కాదు. ఇది ఊబకాయం, క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత , వంధ్యత్వం వంటి సమస్యలను కూడా పెంచుతుంది. ముఖ్యంగా 'డీఈహెచ్‌పీ' (DEHP) అనే థాలేట్ గుండె ధమనులలో వాపును పెంచుతుంది. దీనివల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం అనేక రెట్లు పెరుగుతుంది.