క్యాన్సర్‌ వ్యాధి ఉందా లేదా ఎలా తెలుస్తుంది.. ఇది వారసత్వంగా వస్తుందా..?

* క్యాన్సర్ ఒక తీవ్రమైన వ్యాధి. సరైన సమయంలో చికిత్స చేయకపోతే మరణమే శరణ్యం.

Update: 2021-11-24 08:45 GMT

క్యాన్సర్‌ వ్యాధి ఉందా లేదా ఎలా తెలుస్తుంది.. ఇది వారసత్వంగా వస్తుందా..?

Cancer: క్యాన్సర్ ఒక తీవ్రమైన వ్యాధి. సరైన సమయంలో చికిత్స చేయకపోతే మరణమే శరణ్యం. నోటి కేన్సర్ అయినా, ఉదర క్యాన్సర్ అయినా, బ్రెస్ట్ కేన్సర్ అయినా, బ్లడ్ కేన్సర్ అయినా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సరైన చికిత్స చేయవచ్చు. ఆలస్యం అయతే వ్యాధి తీవ్రమవుతుంది. ఎప్పుడైనా కానీ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తిస్తే నయం చేయవచ్చు.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో కొన్నిసార్లు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరం లోపల ఏదైనా చిన్న గడ్డ ఏర్పడితే అది నయం కాకపోతే వెంటనే అప్రమత్తం కావాలి. ఎందుకంటే ఇలాంటి గడ్డలు నొప్పిని కలిగి ఉండవు. అందుకే చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. అదేవిధంగా మూత్రం, మలవిసర్జనలో రక్తం వస్తుంది. దగ్గు రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే TB కావొచ్చు. క్యాన్సర్ కూడా రావచ్చు. ఈ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులువు అవుతుంది.

ఇటువంటి లక్షణాలు ఏవైనా ఉంటే సాధారణంగా ఒక వారంలో నయం చేయాలి. అది జరగకపోతే ఖచ్చితంగా ఆస్పత్రిలో చేరాలి. ఉదాహరణకు, గుట్కా, పాన్ మొదలైన వాటిని తినే వ్యక్తులు ఎక్కువగా క్యాన్సర్‌ ప్రమాదానికి గురవుతారు. అలాంటి వారికి ఏవైనా లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా వైద్యుడికి చూపించాలి.

క్యాన్సర్ ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమించే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. చాలా క్యాన్సర్లు జన్యుపరంగా వస్తాయి. అంటే మన శరీరం లోపల ఉండే జన్యువుల వైవిధ్యం వల్ల వస్తుంది. కుటుంబంలో తోబుట్టువులు లేదా పిల్లలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది తెలుసుకోవాలంటే బయాప్సీ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. కుటుంబం నుంచి ఒక వ్యక్తి క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు కుటుంబ సభ్యులు కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఏవైనా లక్షణాలు ఉంటే ముందుగానే గుర్తించి చికిత్స చేయవచ్చు.

Tags:    

Similar News