ప్రపంచంలో 85 శాతం మంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు..! చికిత్స ఏంటంటే..?

Update: 2021-12-21 06:45 GMT

ప్రపంచంలో 85 శాతం మంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు..! చికిత్స ఏంటంటే..?

Migraines: ప్రపంచంలో చాలామంది నిత్యం మైగ్రేన్‌తో బాధపడుతారు. కొంతమంది రెగ్యులర్‌గా అనుభవిస్తే మరికొంతమంది అప్పుడప్పుడు ఎదుర్కొంటారు. అయితే దీనికి ఇప్పటికి సరియైన మందు లేదు. దాదాపుగా ప్రపంచంలో 100 మిలియన్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. విచిత్రమేంటంటే ఇందులో 85 శాతం మహిళలే ఉంటారు. మైగ్రేన్‌ వీరిలో ఎక్కువగా వస్తుంది. పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

మైగ్రేన్లు తరచుగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య వస్తుంది. వీరు 12 ఏళ్ల వయసులో మొదటి మైగ్రేన్ నొప్పిని అనుభవిస్తారు. 100 కోట్ల మంది రోగులలో 85 శాతం మంది మహిళలేనని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ 40 శాతం మంది అంటే 40 లక్షల మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. అయితే JAMAలో ప్రచురించబడిన ఒక పరిశోధనా అధ్యయనం ప్రకారం మైండ్‌ఫుల్ మెడిటేషన్, యోగా మైగ్రేన్‌లను తగ్గించగలవు. మైగ్రేన్ దాడులను తగ్గించడంలో మైండ్‌ఫుల్‌నెస్ ఆధారిత చికిత్స ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధనలో తేలింది. నిరంతర ధ్యానం, యోగా చేసే వ్యక్తులు మైగ్రేన్‌ సులువుగా తగ్గించుకుంటారు.

మైగ్రేన్ రోగులకు నిపుణులు కూడా ఖచ్చితంగా ధ్యానం, యోగాను సిఫార్సు చేస్తారు. స్వచ్ఛమైన గాలిలో నడవడం, శ్వాసను అనుభూతి చెందడం, ప్రాణాయామం చేయడం, ధ్యానం చేయడం, యోగా చేయడం ఆరోగ్యానికి మంచిది. ఇవి మైగ్రేన్ పరిస్థితిలో మంచి ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే ఇది యోగా శిక్షకుడు లేదా నిపుణుల సలహాతో మాత్రమే చేయాలి. వారి పర్యవేక్షణలో నేర్చుకున్న తర్వాత ఇంట్లోనే స్వీయ అభ్యాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Tags:    

Similar News