అర్ధరాత్రి హఠాత్తుగా నిద్రలేస్తున్నారా? వైద్యులు చెబుతున్న ప్రమాదకర సంకేతం ఇదే..!
Ardharaatri Nidra Break: అర్ధరాత్రి 1–2 గంటలకు హఠాత్తుగా మెలకువ వస్తుందా? ఇది ఒత్తిడికి సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిక. కారణాలు & health risks తెలుసుకోండి.
అర్ధరాత్రి 1 గంట, 2 గంటల సమయంలో హఠాత్తుగా మెలకువ వస్తోందా? ఇది సాధారణం కాదు. మీ శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతోందని తెలిపే ముఖ్య సంకేతం ఇదేనని ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ భోజ్‌రాజ్ దీనిపై ప్రత్యేకంగా హెచ్చరిక జారీ చేశారు.
ఎందుకు అర్ధరాత్రి నిద్ర లేస్తుంది?
డాక్టర్ భోజ్‌రాజ్ వివరణ ప్రకారం…
మన శరీరంలో ఉండే ప్రధాన స్ట్రెస్ హార్మోన్ – కార్టిసాల్ (Cortisol) అసాధారణ స్థాయిలో పెరగడం వల్ల రాత్రిపూట మెలకువ వస్తుంది.
సాధారణంగా:
ఉదయం లేచే సమయానికి కార్టిసాల్ పీక్‌కి చేరాలి కానీ మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఈ హార్మోన్ రాత్రి 1–3 గంటల మధ్యే పెరుగుతుంది దీంతో శరీరం నిద్రలోనే అలర్ట్ అవుతుంది → హఠాత్తుగా మేల్కొలుపు
డాక్టర్ భోజ్‌రాజ్ మాట్లాడుతూ,
“అర్ధరాత్రి మేల్కొవడం మీ శరీరం ‘మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు’ అని చెప్పే స్పష్టమైన సంకేతం” అన్నారు.
ఇది ఎందుకు ప్రమాదకరం?
ఆయన చెబుతున్న వివరాలు:
1. నాడీ వ్యవస్థ (Nervous System) ఒత్తిడిలో ఉంది
రాత్రిపూట పారాసింపథెటిక్ సిస్టమ్ (Rest Mode) పనిచేయాలి. కాని ఒత్తిడితో ఇది డిస్టర్బ్ అవుతుంది.
2. కార్టిసాల్ అసాధారణంగా పెరుగుతుంది
కార్టిసాల్ స్పైక్ వల్ల శరీరం నిద్రను విడిచిపెట్టి అలర్ట్ అవుతుంది.
3. కాలేయం (Liver) అధికంగా పని చేస్తోంది
నిద్రలో ఉండాల్సిన సమయంలో శరీరం అత్యవసర మోడ్‌లోకి వెళ్తుంది.
4. రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరత
బ్లడ్ షుగర్ పడిపోవడం కూడా అర్ధరాత్రి మేల్కొలుపుకు ఒక పెద్ద కారణం.
5. భావోద్వేగ ఒత్తిడి / ఆందోళన
పగటిపూట మానసిక భారం → రాత్రిపూట కార్టిసాల్ డిస్టర్బెన్స్ → నిద్రలేమి.
డాక్టర్ భోజ్‌రాజ్ ఏమంటున్నారు?
ఆయన చెప్పిన ముఖ్య విషయాలు:
1.“అర్ధరాత్రి మేల్కొవడం సాధారణం కాదు.
ఇది ఒక బయాలజికల్ అలారం.”
2.“మీ నాడీ వ్యవస్థ పూర్తిగా రిలాక్స్ అవ్వడం లేదు.”
3.“ఇది మీ శరీరం మోస్తున్న ఒత్తిడిని మీరు గుర్తించాల్సిన సమయంలో ఇచ్చే హెచ్చరిక.”
4. “ఆందోళన, చిరాకు కంటే ముందే కనిపించే stress signal ఇదే.”
ఇలాంటి నిద్రలేమిని నిర్లక్ష్యం చేస్తే?
వైద్యుల హెచ్చరిక:
- అధిక రక్తపోటు
- గుండెజబ్బుల ప్రమాదం
- హార్మోన్ అసమతుల్యత
- anxiety & depression
- daytime fatigue
- బరువు పెరుగుదల
- ఇమ్యూనిటీ తగ్గుదల
ఈ సమస్యలకు ఇది తొలి సంకేతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని సాధారణంగా తీసుకోకండి!
ఇలాంటి రాత్రిపూట మేల్కొలుపు, మీ శరీరం —
“నా మీద చాలా ఒత్తిడి ఉంది.. దాన్ని తగ్గించండి” అని చెబుతున్నట్టే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.