పీపీఎఫ్‌లో అధిక వడ్డీ పొందాలా? ఈ చిన్న ట్రిక్‌తో మీ ఆదాయాన్ని పెంచుకోండి!
PPFలో అధిక వడ్డీ పొందాలంటే డిపాజిట్ టైమింగ్ కీలకం. ఐదో తేదీ లోపు డిపాజిట్ చేస్తే నెలవారీ వడ్డీ లభిస్తుంది. పూర్తి వివరాల కోసం ఈ వ్యాసాన్ని చదవండి.
Want Higher Returns from PPF? Use This Simple Trick to Boost Your Earnings!
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) — ఇది కేంద్ర ప్రభుత్వ హామీతో ఉన్న అత్యంత సురక్షితమైన మరియు పాపులర్ చిన్న మొత్తాల పొదుపు పథకం. దీని వడ్డీ రేటు ప్రస్తుతం 7.1 శాతంగా ఉంది. కానీ మీరు పీపీఎఫ్‌లో ఎప్పుడైతే డిపాజిట్ చేస్తారో, అదే మీ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది.
ఐదో తేదీ లోపు డిపాజిట్ చేస్తే అదనపు లాభం!
పీపీఎఫ్‌లో వడ్డీ లెక్కించే విధానం ప్రకారం, ప్రతి నెల 5వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఉన్న కనిష్ఠ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ చెల్లిస్తారు. అంటే మీరు 5వ తేదీకి ముందు డిపాజిట్ చేస్తే ఆ నెల మొత్తానికి వడ్డీ లభిస్తుంది.
ఉదాహరణకు –
- జూలై 4న రూ.1.5 లక్షలు డిపాజిట్ చేస్తే, జూలై నెల వడ్డీ వస్తుంది.
- అదే జూలై 6న చేస్తే, జూలై వడ్డీ కట్ అయి ఆగస్టు నుంచే లెక్కవుతుంది.
ఏప్రిల్ 5లోపు పూర్తి డిపాజిట్ చేయండి!
ఏకమొత్తంగా సంవత్సరానికి గరిష్ఠ పెట్టుబడి అయిన రూ.1.5 లక్షలు వేసే వారు ఏప్రిల్ 5వ తేదీకి ముందు డిపాజిట్ చేస్తే, ఆ ఆర్థిక సంవత్సరానికి 12 నెలలపాటు వడ్డీ లభిస్తుంది.
ఆటో డెబిట్ సదుపాయం వినియోగించండి
నెలనెలా డిపాజిట్ చేసే వారు ప్రతి నెల 5వ తేదీకి ముందే డిపాజిట్ అయ్యేలా బ్యాంకులో ఆటో డెబిట్ ఏర్పాటు చేసుకోవాలి. ఇది చిన్న మార్పే అయినా, ఎక్కువ వడ్డీ పొందే చాన్స్ ఇస్తుంది.
పీపీఎఫ్ ఖాతా పొడిగింపుతో మరిన్ని లాభాలు
15 ఏళ్ల గడువు తర్వాత, 5 ఏళ్ల చొప్పున పీపీఎఫ్ ఖాతాను పొడిగించవచ్చు. రెగ్యులర్‌గా పూర్తి మొత్తం డిపాజిట్ చేస్తూ ఉంటే, దీన్నిబట్టి పెద్ద మొత్తంలో వడ్డీతో పాటు, భవిష్యత్‌కు బలమైన పొదుపు కూడా సాద్యమవుతుంది.
PPF ప్లాన్: ఆదాయ భద్రతకు ఆప్త మిత్రం!
టాక్స్ సేవింగ్, గ్యారెంటీడ్ రిటర్న్స్, లాంగ్‌టెర్మ్ పన్ను ప్రయోజనాలు అందించే ఈ పథకాన్ని తెలివిగా వినియోగించుకుంటే, మీరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించవచ్చు.