TS EAPCET: తెలంగాణ ఈఏపీసెట్‌ షెడ్యూల్‌ విడుదల

TS EAPCET: తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది.

Update: 2024-02-06 12:28 GMT

TS EAPCET: తెలంగాణ ఈఏపీసెట్‌ షెడ్యూల్‌ విడుదల

TS EAPCET: తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. ఈఏపీసెట్‌ 2024 షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 21 నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి వెల్లడించారు. మే 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గతంలో టీఎస్‌ ఎంసెట్‌గా పేర్కొనే ఈ పరీక్షకు టీఎస్‌ ఈఏపీసెట్‌గా ఇటీవలే మార్పు చేయగా..ఈ సంవత్సరం ఈఏపీసెట్‌ పరీక్షలను జేఎన్‌టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ నిర్వహించనుందని ఆయన వివరించారు.

Tags:    

Similar News