Gulf Jobs: ఐటీఐ, డిప్లొమా అర్హత ఉన్నవారికి సౌదీ అరేబియాలో ఉద్యోగాలు.. నెలకు రూ.72,000 వరకు వేతనం

Gulf Jobs: సౌదీ అరేబియాలో పనిచేయాలని ఆశిస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వ సంస్థ TOMCOM (Telangana Overseas Manpower Company) శుభవార్త అందించింది.

Update: 2026-02-06 12:57 GMT

Gulf Jobs: సౌదీ అరేబియాలో పనిచేయాలని ఆశిస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వ సంస్థ TOMCOM (Telangana Overseas Manpower Company) శుభవార్త అందించింది. సౌదీ అరేబియాలోని ప్రముఖ సంస్థల కోసం T&C Technician (Testing & Commissioning) పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ITI లేదా డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. వయస్సు 22 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత రంగంలో 3 నుంచి 5 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,000 నుంచి రూ.72,000 వరకు జీతం చెల్లించనున్నట్లు TOMCOM అధికారులు వెల్లడించారు. అదనంగా ఉచిత వసతి, భోజనం, మెడికల్ సదుపాయాలు, రవాణా సౌకర్యం కూడా కల్పించనున్నారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన రెజ్యూమ్‌ను

📧 tomcom.resume@gmail.com

కు పంపాలని సూచించారు.

మరిన్ని వివరాల కోసం

📞 94400 51285, 82478 38789, 94400 51452 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

ఈ అవకాశాన్ని అర్హత ఉన్న అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని TOMCOM సూచించింది.


 

Tags:    

Similar News