TS TET Exam: నేటి నుంచి తెలంగాణ టెట్ ఎగ్జామ్..
TS TET Exam: నేటి నుంచి జూన్ 2 వరకు తెలంగాణలో టెట్ పరీక్షలు
TS TET Exam: నేటి నుంచి తెలంగాణ టెట్ ఎగ్జామ్..
TS TET Exam: తెలంగాణలో నేటి నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. . తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్... మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.
టెట్‌కు ఈసారి మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కి 99 వేల 958 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్-2కి లక్షా 86 వేల 428 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలిసారిగా టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. టెట్ కు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే నిర్ణీత సమయం కంటే 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. అందుకే అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు.