TG Polycet Results 2025: తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..!

TG Polycet Results 2025: తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 13వ తేదీన నిర్వహించిన పాలిసెట్‌ (TG Polycet) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Update: 2025-05-24 06:11 GMT

TG Polycet Results 2025: తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..!

TG Polycet Results 2025: తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 13వ తేదీన నిర్వహించిన పాలిసెట్‌ (TG Polycet) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో సాంకేతిక విద్య కమిషనర్ దేవ సేన పాలీసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://www.polycet.sbtet.telangana.gov.in/#!/index ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

ఈ పరీక్షకు మొత్తం 1,06,716 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 98,858 మంది హాజరయ్యారు. మొత్తం హాజరైన వారి శాతం 92.64%గా నమోదు కావడం విశేషం. పాలిసెట్‌-2025 ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నిక్, ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు లభించనున్నాయి. 

Tags:    

Similar News