RBI Recruitment 2023: పది, డిప్లొమా చేసినవారికి బంపర్ ఆఫర్.. ఆర్బీఐలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు..!

RBI Recruitment 2023: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)లో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం వచ్చింది.

Update: 2023-03-26 15:30 GMT

RBI Recruitment 2023: పది, డిప్లొమా చేసినవారికి బంపర్ ఆఫర్.. ఆర్బీఐలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు..!

RBI Recruitment 2023: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)లో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం వచ్చింది. ఆర్బీఐ ఫార్మసిస్ట్‌ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం RBI అధికారిక వెబ్‌సైట్ rbi.org.inను సందర్శించి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫారమ్‌ను పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 10, 2023 చివరి తేదీగా నిర్ణయించారు. దీని తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేరు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 25 ఫార్మసిస్ట్ ఉద్యోగాలని భర్తీ చేస్తారు. ఇందుకోసం అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే ఫార్మసీలో డిప్లొమా కలిగి ఉండాలి. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులని మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీంతోపాటు మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది.

చిరునామా- రీజినల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, రిక్రూట్‌మెంట్ విభాగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై రీజనల్ ఆఫీస్, షాహిద్ భగత్ సింగ్ రోడ్, ఫోర్ట్, ముంబై - 400001.

Tags:    

Similar News