RBI Recruitment 2023: నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్.. ఆర్బీఐలో అసిస్టెంట్‌ ఉద్యోగాలు..!

RBI Recruitment 2023: నిరుద్యోగులకు ఇది బంపర్‌ ఆఫర్ అని చెప్పాలి. ఎందుకంటే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని పలు బ్రాంచ్‌ల్లో అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీ చేపట్టింది.

Update: 2023-09-25 13:30 GMT

RBI Recruitment 2023: నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్.. ఆర్బీఐలో అసిస్టెంట్‌ ఉద్యోగాలు..!

RBI Recruitment 2023: నిరుద్యోగులకు ఇది బంపర్‌ ఆఫర్ అని చెప్పాలి. ఎందుకంటే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని పలు బ్రాంచ్‌ల్లో అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇందుకోసం నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. ఇందులో మొత్తం 450 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు.. ఎలా అప్లై చేసుకోవాలి తదితర విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఆర్‌బీఐ మొత్తం 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా విభాగంలో బ్యాచిలగర్ డిగ్రీని కలిగి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో పాస్‌ అయి ఉండాలని గుర్తుంచుకోండి. దీంతో పాటు అభ్యర్థులకు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ తప్పనిసరిగా ఉండాలి. అలాగే స్థానిక, రాష్ట్ర భాషలపై అవగాహన ఉండాలి. దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్‌ 4వ తేదీతో ముగుస్తుంది. ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 23 వరకు నిర్వహిస్తారు.

అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామినేషన్‌, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్ ఎగ్జామినేషన్‌తో పాటు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 450 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది. పూర్తి వివరాల కోసం ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చూస్తే సరిపోతుంది.

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తర్వాత ఆ ఫామ్‌ను ప్రింట్‌ తీసుకొని ఆఫ్‌లైన్‌ విధానంలో పంపించాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రీజినల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, రిక్రూట్‌మెంట్ విభాగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబయి రీజనల్ ఆఫీస్, షాహిద్ భగత్ సింగ్ రోడ్డు, ఫోర్ట్, ముంబయి చిరునామాకు పంపాలి.

Tags:    

Similar News