B.Tech course: ఈసీఈ, సీఎస్సీనే కాదు.. బీటెక్ కోర్సుల్లో ఇవి కూడా బెస్ట్..!

B.Tech course: ఒకప్పుడు బీటెక్ అనగానే గుర్తొచ్చేది సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు మాత్రమే.

Update: 2025-06-18 01:57 GMT

B.Tech course: ఈసీఈ, సీఎస్సీనే కాదు.. బీటెక్ కోర్సుల్లో ఇవి కూడా బెస్ట్..!

B.Tech course: ఒకప్పుడు బీటెక్ అనగానే గుర్తొచ్చేది సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు మాత్రమే. ఇంజనీరింగ్ అంటే సివిల్ ఇంజనీరింగ్ అని మాత్రమే అనుకునే రోజులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత 90వ దశకం నుంచి సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ నెమ్మదిగా పురుడు పోసుకొని ఎదగడం ప్రారంభించాక CSE (Computer Science), ECE (Electronics) వంటి కోర్సుల వైపు ఎక్కువగా చూడటం ప్రారంభించారు.

ఇప్పటికీ కూడా CSE (Computer Science), ECE (Electronics) కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం మార్కెట్లో సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్  ఉండటమే కారణమని చెప్పవచ్చు. అంతేకాదు ఉద్యోగాలు కూడా ఎక్కువగా ఈ రంగంలోనే ఉన్నాయి.

అయితే ప్రస్తుతం రాను రాను పరిస్థితులు మారిపోతున్నాయి దీంతో కొత్త కోర్సులు బీటెక్ కాంబినేషన్లో చదివేందుకు విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి కోర్సుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Artificial Intelligence & Data Science (AI & DS): . ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా డేటా సైన్స్ ఆధారంగా పనిచేసే ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కాంబినేషన్లో ఉన్న బీటెక్ కోర్సు చేసేందుకు విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ కాంబినేషన్లో కోర్సు చేసినవారికి గూగుల్, అమెజాన్, మెటా వంటి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి.

Cyber Security : ఇప్పుడు ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న కోర్సుగా పరిణమిస్తుంది అందుకే బీటెక్ చదివే విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ పైన స్పెషల్ ఉన్నటువంటి బీటెక్ చదివినందుకు ఇష్టపడుతున్నారు.

Computer Science with Business Systems (CSBS): ప్రస్తుతం డిమాండ్ ఉన్నటువంటి బీటెక్ కోర్సుల్లో ఇది కూడా విద్యార్థులు ఎక్కువగా జాయిన్ అయ్యేందుకు ఇష్టపడుతున్నారు.

Robotics and Automation: భవిష్యత్తు అంతా రోబోటిక్స్, ఆటోమేషన్ చుట్టూనే తిరుగుతుంది అనేందుకు ఏమాత్రం సందేహం లేదు అందుకే చాలామంది విద్యార్థులు ఈ కోర్సు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

Bio-Technology: కరోనా అనంతరం ఎక్కువగా బయోటెక్నాలజీ పైన అందరి దృష్టి ఎక్కువగా సాధించారు. ముఖ్యంగా ఈ కోర్సులు చదివిన విద్యార్థులకు మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి.

Tags:    

Similar News